బంగ్లాదేశ్ వేదికగా జరగబోయే మహిళల టి20 ప్రపంచ కప్( Women’s T20 World Cup ) 2024 సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ( ICC ) విడుదల చేసింది.అక్టోబర్ 3 నుండి ఈ మెగా టోర్నీ మొదలు కాబోతోంది.
మొత్తం ఈ టోర్నీలో 23 మ్యాచులు అక్టోబర్ 20 వరకు జరగనున్నాయి.ప్రపంచవ్యాప్తంగా మొత్తం పది జట్లు ఈ ప్రపంచకప్ కోసం పోటీ పడనున్నాయి.
ఈ వరల్డ్ కప్ సంబంధించి ఇప్పటికీ ఎనిమిది జట్లు అర్హత సాధించగా.మరో రెండు జట్లు క్వాలిఫైయింగ్ రౌండ్ల ద్వారా పోటీలో పాల్గొనబోతున్నాయి.
ఈ క్వాలిఫై రౌండ్లు ముగిసిన తర్వాత మొత్తం పది జట్లను రెండు గ్రూపులుగా విభజించనున్నారు.ఇందులో గ్రూప్ ఏ, గ్రూప్ బి ఉన్నాయి.గ్రూప్ A లో.భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్ తోపాటు క్వాలిఫైయర్ 1( Qualifier 1 ) జట్లు ఉంటాయి.అలాగే గ్రూప్ B లో ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా క్వాలిఫైయర్ 2 జట్లు ఉండబోతున్నాయి.
ఈ టోర్నమెంట్లో టీమిండియా తన మొదటి మ్యాచ్ ను అక్టోబర్ 4న న్యూజిలాండ్ తో తలపడనుంది.ఆ తర్వాత అక్టోబర్ ఆరున చిరకాల పద్ధతులైన పాకిస్తాన్, భారత్ జట్లు తలపడునున్నాయి.ఇక ఫైనల్, సెమీఫైనల్స్ కు గాను రిజర్వ్ డేలను ఉంచారు.
ఇక ఈ టోర్నమెంట్ లోని మ్యాచ్ల షెడ్యూల్ ఇలా ఉన్నాయి.
అక్టోబర్ 3 – ఇంగ్లాండ్ vs సౌతాఫ్రికా – ఢాకా వేదిక అక్టోబర్ 3 – బంగ్లాదేశ్ vs క్వాలిఫైయర్ 2 – ఢాకా అక్టోబర్ 4 – ఆస్ట్రేలియా vs క్వాలిఫైయర్ 1 – సిల్హెట్ అక్టోబర్ 4 – భారత్ vs న్యూజిలాండ్ – సిల్హెట్ అక్టోబర్ 5 – దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్ – ఢాకా అక్టోబర్ 5 – బంగ్లాదేశ్ vs ఇంగ్లాండ్ – ఢాకా అక్టోబర్ 6 – న్యూజిలాండ్ vs క్వాలిఫైయర్ 1 – సిల్హెట్ అక్టోబర్ 6 – భారత్ vs పాకిస్థాన్ – సిల్హెట్ అక్టోబర్ 7 – వెస్టిండీస్ vs క్వాలిఫయర్ 2 – ఢాకా అక్టోబర్ 8 – ఆస్ట్రేలియా vs పాకిస్తాన్ – సిల్హెట్ అక్టోబర్ 9 – బంగ్లాదేశ్ vs వెస్టిండీస్ – ఢాకా అక్టోబర్ 9 – భారత్ vs క్వాలిఫైయర్ 1 – సిల్హెట్ అక్టోబర్ 10 – దక్షిణాఫ్రికా vs క్వాలిఫైయర్ 2 – ఢాకా అక్టోబర్ 11 – ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్ – సిల్హెట్ అక్టోబర్ 11 – పాకిస్థాన్ vs క్వాలిఫైయర్ 1 – సిల్హెట్ అక్టోబర్ 12 – ఇంగ్లండ్ vs వెస్టిండీస్ – ఢాకా అక్టోబర్ 12 – బంగ్లాదేశ్ vs సౌతాఫ్రికా – ఢాకా అక్టోబర్ 13 – పాకిస్థాన్ vs న్యూజిలాండ్ – సిల్హెట్ అక్టోబర్ 13 – భారత్ vs ఆస్ట్రేలియా – సిల్హెట్ అక్టోబర్ 14 – ఇంగ్లండ్ vs క్వాలిఫైయర్ 2 – ఢాకా అక్టోబర్ 17 – మొదటి సెమీ-ఫైనల్ – సిల్హెట్ అక్టోబర్ 18 – రెండవ సెమీ-ఫైనల్ – ఢాకా అక్టోబర్ 20 – ఫైనల్ – ఢాకా