తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు అందింది.ఏపీ మరియు తెలంగాణలో రానున్న రోజుల్లో వర్షాలు( rains ) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో వచ్చే ఐదు రోజుల్లో వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.ఈ మేరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది.
ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ఇక ఏపీలో రేపటి నుంచి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
దాదాపు మూడు రోజులపాటు వానలు కురవనున్నాయని తెలుస్తోంది.అదేవిధంగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.