ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో ఆరు నెలలలో శ్రీలంక మాదిరిగా తయారవుతుందని పేర్కొన్నారు.ఆర్థిక సంక్షోభంలోకి ఏపీ వెళుతుందని చెప్పుకొచ్చారు.
ఇటీవల “జగన్ పోవాలి పాల్ రావాలి” అనే నినాదంతో చేపట్టిన యాత్ర లో భాగంగా ప్రకాశం జిల్లాలో ఒంగోలులో కేఏ పాల్ మాట్లాడటం జరిగింది.ఈ నేపథ్యంలో దేశాన్ని రక్షించుకోకపోతే రాష్ట్రాన్ని కూడా రక్షించలేమని పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వం చేస్తున్న విచ్చలవిడి అప్పుల కారణంగా ఆరు నెలలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక మాదిరిగా మారటం గ్యారెంటీ అని జోష్యం చెప్పారు.జగన్ ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదని పేర్కొన్నారు.
ముఖ్యంగా తనపై ఉన్న కేసులకు.జగన్ కేంద్ర ప్రభుత్వం వద్ద భయపడుతున్నారని.
ఏమి అడగలేకపోతున్నారని విమర్శలు చేశారు.దేశంలో దారుణంగా అవినీతి పేరుకుపోయిందని తనని ప్రధాని చేస్తే.
దేశానికి మంచి రోజులు వస్తాయని స్పష్టం చేశారు.రాబోయే ఎన్నికలలో తెలంగాణ నుండి పోటీ చేస్తున్నట్లు .సీఎం అవుతానని కేఏ పాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.







