షర్మిల భవిష్యత్ తేలే రోజు..?

వైఎస్ షర్మిల( YS Sharmila ) తన పార్టీని కాంగ్రెస్( Congress ) లో విలీనం చేస్తారని లేదా కాంగ్రెస్ కు మద్దతు ప్రకటిస్తారని గత కొన్నాళ్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అటు కాంగ్రెస్ నేతలు కూడా షర్మిల తమతో టచ్ లో ఉన్నారని, కాంగ్రెస్ లో చేరడం పక్కా అని చెబుతున్నారు.

 Sharmila Future Floating Day , Sharmila, Congress, Ys Sharmila, Telangana, Presi-TeluguStop.com

అయితే షర్మిల మాత్రం ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కనీసం ఖండించనులేదు.దీంతో ఆమె కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే వార్తలకు బలం చేకూరుతువచ్చింది.

కాగా ఒకవేళ ఆమె కాంగ్రెస్ లో చేరితే షర్మిల పాత్ర తెలంగాణలో( Telangana ) ఉంటుందా లేదా ఏపీకి షిఫ్ట్ అవుతుందా అనేది కూడా ఆసక్తికరంగా జరుగుతున్నా చర్చ.

Telugu Congress, Revanth Reddy, Sharmila, Sharmila Day, Telangana, Ys Jagan, Ys

తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ మెరుగ్గానే ఉంది.కానీ ఏపీలో మాత్రం హస్తం పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది.ఈ నేపథ్యంలో షర్మిల సేవలను హస్తం పార్టీ ఏ రాష్ట్రంలో ఉపయోగించుకుంటుందనేది ప్రశ్నార్థకం.

కాగా టి కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడాన్ని ఆ పార్టీ నేతలంతా స్వాగతిస్తున్నప్పటికి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( President Revanth Reddy )మాత్రం నిరాకరిస్తున్నారు.షర్మిల ఏపీ కాంగ్రెస్ లో చేరితే ఒకే అని.తెలంగాణలో షర్మిల సేవలు కాంగ్రెస్ కు అవసరం లేదనే విధంగా వ్యాఖ్యానిస్తున్నారు.ఇందుకే షర్మిల కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

Telugu Congress, Revanth Reddy, Sharmila, Sharmila Day, Telangana, Ys Jagan, Ys

తెలంగాణ బిడ్డను అని పదే పదే చెబుతున్నా షర్మిల.మళ్ళీ తెలంగాణ వీడి ఏపీలో కాంగ్రెస్ తరుపున బరిలోకి దిగితే.రెండు రాష్ట్రాల్లో కూడా రెంటికీ చెడ్డ రేవడిలా మారుతుందనే ఆలోచన షర్మిల వేధిస్తోంది.అదికాక ఏపీలో తన అన్న వైఎస్ జగన్ ( YS Jagan )మీద పోటీ చేస్తే అది మరిన్ని వివాదాలకు తవిచ్చే అవకాశం లేకపోలేదు.

అందుకే షర్మిల కాంగ్రెస్ లో చేరడంపై ఇంకా సస్పెన్స్ గానే ఉన్నారు.అయితే నేడు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయ చేరుకున్న షర్మిల అక్కడ తన రాజకీయ భవిష్యత్ గురించి మాట్లాడే అవకాశం ఉంది.

అంతేకాకుండా తన పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలా వద్దా అనే దానిపై కూడా స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.మరి షర్మిల ఎటు డిసైడ్ అవుతారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube