మనం సినిమా తర్వాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన చిత్రం థాంక్యూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా ఈనెల 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో నాగచైతన్య, రాశిఖన్నా, మాళవిక నాయక్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు ప్రేక్షకులను పెద్దగా సందడి చేయలేకపోయింది.
ఈ క్రమంలోనే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ సొంతం చేసుకోలేకపోయింది.
ఇకపోతే ఈ సినిమా విడుదలై ఆరు రోజులు కావడంతో ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టింది ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవాలంటే ఇంకెంత రాబట్టాలి అనే విషయానికి వస్తే ఈ సినిమా ఆరు రోజులకు గాను నైజం సీడెడ్ ఏరియాలో కలిపి రూ.9.50 కోట్ల బిజినెస్ జరుపుకుంది.రెండు తెలుగు రాష్ట్రాలలో 20 కోట్ల బిజినెస్ చేయగా, రెస్టాఫ్ ఇండియాలో రూ.1.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.2.50 కోట్లతో కలిపి రూ.24.00 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలిసింది.ఆరు రోజులకు గాను ఈ సినిమా ఏ ఏ ప్రాంతాలలో ఎంత మేర కలెక్షన్లను రాబట్టింది అనే విషయానికి వస్తేనైజాంలో రూ.1.19 కోట్లుసీడెడ్లో: రూ.37 లక్షలుఉత్తరాంధ్రలో: రూ.62 లక్షలుఈస్ట్ గోదావరిలో: రూ.28 లక్షలువెస్ట్ గోదావరిలో : రూ.17 లక్షలుగుంటూరులో: రూ.21 లక్షలుకృష్ణాలో: రూ.24 లక్షలు
నెల్లూరులో: రూ.12 లక్షలతో.రూ.3.20 కోట్లు షేర్, రూ.5.48 కోట్లు గ్రాస్ దక్కింది.ఆరు రోజులలో ఈ సినిమా రూ.4.21 షేర్‌తో పాటు రూ.7.45 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.ఇకపోతే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్లు కాగా ఆరు రోజుల్లో ఈ సినిమాకు 4.21 మాత్రమే రాబట్టింది అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 20.79 కోట్లు వస్తేనే ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంటుంది.అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ టార్గెట్ కష్టమేనని తెలుస్తోంది.