అల్లూరి 125వ జయంతి ఉత్సవ కార్యక్రమాలలో భాగంగా ప్రధాని మోడీ నేడు భీమవరం రావటం తెలిసిందే.ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని టీడీపీ కీలక నేత నారా లోకేష్ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోడీ… అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం.చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

“అమాయక గిరిజనం నిరంకుశ పాలకుల చేతుల్లో నలిగిపోతుంటే వారిలో ధైర్యం నింపి నిప్పు కణాల్లా మార్చిన ఉత్తేజం అల్లూరి సీతారామరాజు.స్వాతంత్య్ర పోరులో ధృవతారలా మెరిసి బ్రిటిష్‌వారి గుండెల్లో దడపుట్టించిన మన్యంవీరుడు అల్లూరిని ఆజాది కా అమృత మహోత్సవ్ లో భాగంగా స్మరించుకోవడం మనకు గర్వకారణం.అల్లూరి 125వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని చేతుల మీదుగా అల్లూరి విగ్రహావిష్కరణ జరగడం ఒక తెలుగువాడిగా సంతోషంగా ఉంది.అల్లూరి జయంతి సందర్భంగా ఆ విప్లవజ్యోతి సాహస చరిత్రను స్మరించుకుని స్ఫూర్తిని పొందుదాం.”అంటూ లోకేష్ తెలియజేయడం జరిగింది.