సూర్యాపేట జిల్లా:బహుజన విప్లవ వీరుడు,ఇండియా విప్లవోధ్యమానికి నూతన పంథాను సూచించిన విప్లవ యోధుడు మారోజు వీరన్న అని తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేల్ అన్నారు.మారోజు వీరన్న 23 వ వర్థంతిని పురస్కరించుకుని కర్విరాల కొత్తగూడెంలో వీరన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు అర్పించారు.
ఈ సందర్భంగా మందుల సామేల్ మాట్లాడుతూ భౌగోళిక తెలంగాణ కాదు ప్రజాస్వామిక తెలంగాణ కావాలని,తెలంగాణ రాష్ట్రంలో బహుజనులకు రాజ్యాధిక్కారం దక్కాలని వీరన్న పోరాడాడని అన్నారు.అదిగిట్టని ఆనాటి ప్రభుత్వం వీరన్నను బూటకపు ఎన్కౌంటర్ చేయడం జరిగిందని తెలిపారు.
వీరన్నను భౌతికంగా దూరం చేసినా వారి ఆశయాలను ముందుకు తీసుకపోతామని నినదించారు.ఈ కార్యక్రమంలో సిపియుఎస్ఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ దైద వెంకన్న,జిల్లా కార్యదర్శి మట్టపల్లి లింగయ్య,ఓరుగంటి సత్యనారాయణ, మిట్టగడుపుల పురుషోత్తం,పూసపల్లి భిక్షం,సిపిఐ ఎంఎల్ రామచంద్ర వర్గం రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రసాద్,బుద్ధ సత్యనారాయణ,పిఓఎఫ్ రాష్ట్ర కన్వీనర్ అక్కినపల్లి శ్రీరాములు,దగ్గుల అవిలయ్య, వెంకట్రాములు,యాదయ్య,ఎర్ర సత్యం,దామెర మొగిలి తదితరులు పాల్గొన్నారు.