విశాఖలో ధన్బాద్- అలెప్పి ఎక్స్ప్రెస్ రైలులో నవజాత శిశువును వదిలేసిన ఘటన కలకలం రేపింది.బి-1 బోగి టాయిలెట్ వాష్ బేసిన్లో మగ శిశువును ఓ తల్లి విడిచి వెళ్ళిపోయింది.శిశువు ఏడుపు వినిపించడంతో అక్కడే విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది కాపాడారు.మెరుగైన వైద్యం కోసం రైల్వే ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం శిశువుకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.అప్పుడే పుట్టిన శిశువును ఎవరు విడిచి వెళ్ళారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు.




Latest Video Uploads News