కెకె సినిమాస్ పతాకంపై శివకళ్యాణ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ కె.కళ్యాణ్ రావు నిర్మిస్తున్న చిత్రం “తురుమ్ ఖాన్‌లు” రూరల్ బ్యాక్ డ్రాప్ లో టామ్ అండ్ జెర్రీ లాంటి పాత్రలతో డార్క్ హ్యూమర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో 50 మందికి పైగా నూతన మరియు థియేటర్ ఆర్టిస్టులు నటించారు.
హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా తురుమ్ ఖాన్‌లు టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయ్యింది.
ఈ సందర్భంగా డైరెక్టర్ శివకళ్యాణ్ మాట్లాడుతూ.
బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులు ఒకే ఊరిలో పుట్టి గొడవ పడుతూ లలిత, భారతి, పద్మలని చేరుకునేందుకు ఆరాట పడుతుంటే అక్కడే పుట్టిన శ్రీకృష్ణుడు ఆ చిక్కుముడిని ఎలా విప్పాడనే ఈ చిత్ర కథ, మా తురుమ్ ఖాన్‌లు , డార్క్ హ్యూమర్ జానర్ లో వస్తోన్న ఈ చిత్రం అందరిని అలరిస్తుంది దర్శకుడు తెలిపారు.పోస్టర్ విడుదల చేసిన శ్రీ విష్ణు గారికి థాంక్స్.
![Telugu Aviansh Sunkara, Devaraj Palamur, Harshitha, Kalyan Rao, Shiva Kalyan, Sr Telugu Aviansh Sunkara, Devaraj Palamur, Harshitha, Kalyan Rao, Shiva Kalyan, Sr]( https://telugustop.com/wp-content/uploads/2021/12/tollywood-shiva-kalyan-sriram-nimmalla-devaraj-palamur-aviansh-sunkara-harshitha.jpg)
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ తురుమ్ ఖాన్‌లు పోస్టర్ ఐడియా ఇన్నోవేటివ్ గా ఉంది, డైరెక్టర్ శివకళ్యాణ్ నాకు ఐదు యేళ్ళ నుంచి తెలుసు నా సినిమాలకు వర్క్ చేశాడు, నేనే తనతో సినిమా చేయాల్సింది కుదరలేదు, తన రైటింగ్ అన్నా, తన కామెడీ అన్నా నాకు చాలా ఇష్టం.తురుమ్ ఖాన్‌లు సినిమాతో ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్ గా నిలబడతాడని ఖచ్చితంగా చెప్పగలను, టీం అందరికీ, ముఖ్యంగా ప్రొడ్యూసర్ కి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.
నటీనటులు:
శ్రీరామ్ నిమ్మల, దేవరాజ్ పాలమూర్, అవినాష్ సుంకర, ఐశ్వర్య, హర్షిత, శ్రీయాంక, విజయ్ సింగం, బాస్కర్ కర్నాటి, లక్ష్మణా చారి.
సాంకేతిక నిపుణులు:
కెమెరా-చరణ్ అంబటి ఎడిటర్- బొంతల నాగేశ్వర రెడ్డి మ్యూజిక్- గగన్ కె.ఎస్ నిర్మాత-కె: కళ్యాణ్ రావు రచనా-దర్శకత్వం-శివకళ్యాణ్.