తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.టీఆర్ఎస్ తరువాత రెండో ప్రత్యామ్నాయ స్థానం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితుల్లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య నడుస్తున్న రాజకీయమే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నడుస్తున్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున పరిస్థితులలో కాంగ్రెస్ పై పెద్ద ఎత్తున చర్చ జరగకపోవడంతో కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చర్చ జరుగుతోంది.
అయితే ప్రస్తుతం రైతులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యలతో ఒక్కసారిగా కన్ఫ్యూజన్ లో ఉన్న పరిస్థితి ఉంది.అయితే ఈ సమయంలో కాంగ్రెస్ రైతుల తరపున పోరాటం చేయకపోతే రైతుల సమస్యలపై కాంగ్రెస్ పోరాటం చేయడం లేదనే అపవాదు కాంగ్రెస్ మూటగట్టుకునే అవకాశం ఉంది.
అందుకు రేపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరికి నిరసనగా ధర్నా నిర్వహించనున్నట్లు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.
అయితే ప్రస్తుతం కాంగ్రెస్ లో అంతర్గత పోరు పెద్ద ఎత్తున నెలకొని ఉన్న తరుణంలో రేపటి ధర్నాలో అందరూ సీనియర్లు కలసి పాల్గొంటారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ఎందుకంటే కెసీ వేణుగోపాల్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన వార్ రూమ్ లో కాంగ్రెస్ సీనియర్లు, రేవంత్ రెడ్డి సమావేశమయిన విషయం తెలిసిందే.ఆ సమావేశంలో ఇక నుండి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని హై కమాండ్ సూచించిన నేపథ్యంలో మరి రేపటి ధర్నాలో అందరూ కలిసి పాల్గొంటే ఇక కాంగ్రెస్ లో అంతర్గత పోరు లేదనే సంకేతాలు ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్ళే అవకాశం ఉంది.
ఏది ఏమైనా బీజేపీతో పోటీ పడాలంటే కాంగ్రెస్ ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది.లేకపోతే కాంగ్రెస్ పై ప్రజల్లో చర్చ జరగకపోతే ఇక రానున్న రోజుల్లో కాంగ్రెస్ కు ప్రజల మద్దతు దక్కే అవకాశం లేదు.