విజయ్ సేతుపతి. కష్టాల కడలి నుంచి సినిమా పరిశ్రమలోకి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు.
తన చక్కటి నటనతో తమిళ జనాల మనసు దోచుకున్నాడు.క్యారెక్టర్ ఏదైనా న్యాయం చేసి తీరుతాడు విజయ్ సేతుపతి.
ఇప్పటి వరకు తమిళ జనాలకే తెలిసిన ఈ నటుడు ప్రస్తుతం తెలుగు జనాలకు కూడా పరిచయం అవుతున్నాడు.మెగాస్టార్ చిరంజీవి సినిమా సైరాలో పాండి రాజ్ పాత్ర పోషించి ఆకట్టుకున్న ఈ నటుడు.
ఆ తర్వాత వచ్చిన ఉప్పెన సినిమాతో తెలుగు జనాలకు మరింత దగ్గరయ్యాడు.తనకు పాత్ర నచ్చితే చాలు.
విలన్, హీరో అనే తేడా లేదు.నటనకు స్కోప్ ఉంటే ఏ క్యారెక్టర్ చేసేందుకైనా వెనుకాడడు విజయ్ సేతుపతి.
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేటా సినిమాలో విజయ్ సేతుపతి నెగెటివ్ రోల్ చేశాడు.ఈ సినిమా అతడి కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచింది.
ఇందులో తన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.అటు దళపతి విజయ్ మాస్టర్ సినిమాలోనే నెగెటివ్ రోల్ ప్లే చేశాడు.
ఈసినిమాలోనూ తన నటనతో శభాష్ అనిపించుకున్నాడు.ప్రస్తుతం దిగ్గజ నటుడు కమల్ హాసన్ సినిమా విక్రమ్ లోనూ నటిస్తున్నాడు.
తాజాగా ఆయనపై ఎయిర్ పోర్టులో దాడి జరిగింది.అయితే దాడి ఎందుకు జరిగింది అనేది ఇప్పటికీ సరిగ్గా తెలియదు.ఆయనపై దాడికి ఎందుకు ప్రయత్నించాడో సదరు యువకుడు బయకు వచ్చి చెప్తే తప్ప అసలు వాస్తవాలు బయటకు రావు.
అటు సినిమాల విషయాన్ని కాసేపు పక్కన పెడితే తాజాగా.విజయ్ సేతుపతి ఫ్యామిలీ పిక్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.ఆయన భార్య జెస్సీ, కుమార్తె శ్రీజ, కుమారుడు సూర్యతో కలిసి విజయ్ ఈ ఫోటో తీసుకున్నాడు.
హ్యాపీ ఫ్యామిలీ అంటూ జనాలు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం సౌత్ లో విజయ్ సేతుపతి బాగా పాపులర్ నటుడు అయ్యాడు.మాస్ జనాలకు ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు.సౌత్ లోని పలు సినిమా పరిశ్రమల నుంచి ఆయనకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.