తెలుగులో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయినా ఈ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో హోస్ట్ గా నిర్వహిస్తూ తన వచ్చీరాని తెలుగు మరియు ఎన్నో సెంటర్ నటనతో తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ “రష్మి గౌతమ్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు సినీ పరిశ్రమకి వచ్చిన కొత్తలో పలు చిత్రాలలో నటించి నటిగా తన సినీ కెరీర్ ని మొదలు పెట్టింది.
కానీ ఈ అమ్మడు నటించిన పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.అయితే తన సినీ కెరీర్ ని దృష్టిలో ఉంచుకొని యాంకరింగ్ రంగం లో అడుగు పెట్టింది.
ఆ తరువాత ఈ అమ్మడి ఒక్కసారిగా మలుపు తిరిగిందని చెప్పవచ్చు.దీంతో ప్రస్తుతం ఒక పక్క సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మరో పక్క పలురకాల బాగానే సంపాదిస్తోంది.
అయితే ఈ మధ్య కాలంలో రష్మి గౌతమ్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ క్రమంలో అప్పుడప్పుడు తనకు జంతువుల మీద ఉన్నటువంటి ప్రేమ గురించి తెలియజేస్తూ మూగ జీవాలను హింసించే వీడియోలు కనిపించినా లేదా సహాయం కావాలని ఎవరైనా టాగ్ చేసిన వెంటనే స్పందిస్తూ సంబంధిత ఏరియాల్లో ఉన్నటువంటి హెల్ప్ లైన్ కి సమాచారం అందిస్తుంది.
కాగా తాజాగా రష్మి గౌతమ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఈ వీడియోని చూసినట్లయితే కన్నీళ్లు రాకమానవు.అయితే ఈ వీడియోలో ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను హింసిస్తూ కనిపించాడు.
దీంతో రష్మి గౌతమ్ ఈ విషయంపై స్పందిస్తూ ఈ వ్యక్తి మానవత్వం మరచి దిగజారి ప్రవర్తిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.అంతేకాకుండా మూగ జీవం పై ఇలా కనికరం లేకుండా ప్రవర్తిస్తుండడంతో తన తల్లిదండ్రులు ఎలా పెంచారనే విషయం బాగా అర్థమవుతోందని సంచలన వ్యాఖ్యలు చేసింది.
దీంతో కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఈ మధ్యకాలంలో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు జంతువుల పట్ల ఎలా ప్రవర్తించాలనే విషయం గురించి చెప్పడం మర్చిపోతున్నారని అందువల్ల ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయని కామెంట్లు చేస్తుంటారు.ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ రష్మి గౌతమ్ ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో, డి డాన్స్ కాంపిటీషన్ వంటి కార్యక్రమాలలో హోస్ట్ గా వ్యవహరిస్తూనే మరో పక్క సినిమాల్లో అవకాశాలు బాగానే ప్రయత్నిస్తోంది.కాగా ప్రస్తుతం బొమ్మ బ్లాక్ బస్టర్ అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.