తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన ఈ టీవీలో ప్రసారమయ్యే “ఎక్స్ట్రా జబర్దస్త్” కార్యక్రమంలో యాంకరింగ్ నిర్వహిస్తూ వచ్చీరాని తెలుగులో మాట్లాడుతూ తన క్యూట్ క్యూట్ మాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించే “బ్యూటిఫుల్ యాంకర్ రష్మి గౌతమ్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే యాంకర్ రష్మి గౌతమ్ మొదటిగా ప్రముఖ స్వర్గీయ నటుడు ఉదయ్ కిరణ్ మరియు వెటరన్ హీరోయిన్ రిచా పల్లాడ్ నటించిన “హోలీ” అనే చిత్రం ద్వారా నటిగా తన సినీ కెరీర్ ని ఆరంభించింది.
ఆ తర్వాత పలు చిత్రాలలో నటించినప్పటికీ ఈ అమ్మడి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో నటిగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.కానీ జబర్దస్త్ కార్యక్రమంలో యాంకర్ గా అవకాశం దక్కించుకున్న తర్వాత ఈ అమ్మడి సినిమా కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది.
కాగా తాజాగా యాంకర్ రష్మి గౌతమ్ పై టాలీవుడ్ మాజీ హీరోయిన్ మరియు వైసీపీ ఎమ్మెల్యే రోజా పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.ఇందులో భాగంగా యాంకర్ రష్మీ ది చిన్న పిల్లల మనస్తత్వమని దాంతో అందరితోనూ ఇట్టే కలిసిపోతుందని అంతేకాకుండా కాంట్రవర్సీలకి చాలా దూరంగా ఉంటుందని కూడా తెలియజేసింది.
అయితే రష్మి గౌతమ్ చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు అనుభవించిందని ఈ క్రమంలో తన సినిమా ఇండస్ట్రీలో కష్ట పడి సంపాదించిన డబ్బుతో తన కుటుంబాన్ని నెట్టుకొస్తూ తన సోదరిల పెళ్లిళ్లు కూడా చేసిందని అలాగే సినిమా సెట్స్ లో కూడా చాలా ఎనర్జీతో యాక్టివ్ గా ఉంటుందని అందువల్లే తనకు రష్మి గౌతమ్ అంటే చాలా ఇష్టమని తెలిపింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా యాంకర్ రష్మి గౌతమ్ ప్రస్తుతం ఒక పక్కా జబర్దస్త్ కామెడీ షో లో యాంకరింగ్ నిర్వహిస్తూనే మరోపక్క పలు చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తూ బాగానే ఆకట్టుకుంటోంది.కాగా ప్రస్తుతం తెలుగు యంగ్ హీరో నందు హీరోగా నటిస్తున్న “బొమ్మ బ్లాక్ బాస్టర్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బుల్లితెర పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ కమెడియన్ మరియు హీరో సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న మరో చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.