హుజూరాబాద్ నియోజకవర్గం టిఆర్ఎస్ కు కాస్త ఇబ్బందికర పరిణామాలు ఉన్నాయనే ఇంటెలిజెన్స్ నివేదికలతో టిఆర్ఎస్ అప్రమత్తమైంది.ఇప్పటికే దళిత బంధు వంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టారు.
అయినా ఈటెల రాజేందర్ బలంతో పాటు, టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత తీవ్రంగా ఉన్న క్రమంలో గెలుపు తమ చేయి దాటి పోకుండా ఇప్పటి నుంచి భారీ ప్రణాళికలు రచిస్తోంది.మంత్రులు, ఎమ్మెల్యేలను ఇప్పటికే నియోజకవర్గంలో దించి వారిని మండలాల వారిగా ఇంచార్జిలు గా నియమించింది.
అయితే ఒక వైపు బిజెపి, మరో వైపు కాంగ్రెస్ దూకుడుగా ఉంటూ టిఆర్ఎస్ ను దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తుండడంతో ఆలోచనలో పడింది టిఆర్ఎస్.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు, వాటి ద్వారా ప్రజలు ఎంత వరకు లబ్ధి పొందుతున్నారు , రాబోయే రోజుల్లో ప్రవేశపెట్టబోయే కొత్త పథకాలు ఏమిటి ఇలా అనేక అంశాలను పొందుపరుస్తూ టిఆర్ఎస్ మళ్లీ ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ పేరుతో లేఖలు హుజురాబాద్ ఓటర్లకు అందుతున్నాయి.
తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేయాలంటూ లేఖలో పేర్కొన్నారు.హుజూరాబాద్ నియోజకవర్గం లో రైతుబంధు ద్వారా 62 వేలకు పైగా లబ్ధిదారులు ఉన్నారని, ఆసరా పింఛన్ దారులు 34 వేలు, కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ లబ్ధిదారులు, కెసిఆర్ కిట్ ద్వారా 8197 మంది, గొర్రెల పంపిణీ ద్వారా 5811 మంది, బర్రెల పంపిణీ ద్వారా 1086 , చేనేత పథకం కింద 2254 మంది లబ్ధిదారులు ఉన్నారు.
![Telugu Etela Rajendar, Hujurabad, Telangana, Trs Pamplets-Telugu Political News Telugu Etela Rajendar, Hujurabad, Telangana, Trs Pamplets-Telugu Political News](https://telugustop.com/wp-content/uploads/2021/08/trs-hujurabad-telangana-kcr-hujurabad-elections-voters-trs-pamplets-telangana-gove.jpg )
అలా లబ్ధి పొందుతున్న వారితో పాటు , మిగతా ఓటర్లకు కేసీఆర్ పేరుతో లేఖలు రాస్తున్నారు.ఎప్పుడూ లేని విధంగా టిఆర్ఎస్ ఈ విధంగా పాంప్లెట్ రాజకీయాలకు తెర తీయడం పై టిఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు.కెసిఆర్ కు ఓటమి భయం కలిగిందని, అందుకే ఈ విధంగా లేఖలు రాస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ సెటైర్లు వేస్తున్నారు.ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఈ నియోజకవర్గంలో గెలవడం ఒక్కటే తమ అంతిమ లక్ష్యం అన్నట్లుగా టిఆర్ఎస్ వ్యవహరిస్తోంది.