జగన్ క్యాబినెట్ లోకి కొత్త ఎమ్మెల్సీలు ? ఊస్టింగ్ ఎవరెవరికంటే ? 

రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వైసీపీ( YCP ) అధినేత , ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) చాలా పెద్ద కసరత్తే చేస్తున్నారు.పార్టీ పరంగా,  ప్రభుత్వ పరంగా ఎటువంటి లోటు పాట్లు లేకుండా చూసుకుంటున్నారు.

 New Mlcs Into Jagan's Cabinet Oosting Than Anyone Else, Jagan, Ap Cabinet, Ysrcp-TeluguStop.com

పనితీరు సక్రమంగా లేని ఎమ్మెల్యేలను , మంత్రులను , ముఖ్య నాయకులను పదేపదే హెచ్చరిస్తున్నారు.ఇప్పటికే ఒకటి రెండుసార్లు ఛాన్స్ ఇచ్చిన జగన్ ఇక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ , పార్టీకి,  ప్రభుత్వానికి పెద్దగా ఉపయోగం లేదనుకున్న వారి ప్రాధాన్యాన్ని తగ్గించేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు.

ఇప్పటికే కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు పనితీరుపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ నేరుగా సమావేశాల్లోనే వారిని హెచ్చరించారు.ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రి వర్గ ప్రక్షాళనకు జగన్ శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం మంత్రులలో పనితీరు సక్రమంగా లేనివారిని, మంత్రి పదవుల్లో ఉన్నా, పార్టీకి ప్రభుత్వానికి పెద్దగా కలిసిరాని వారిని తప్పించాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్రధాన సామాజిక వర్గాలకు పెద్దపీట వేయాలని చూస్తున్న జగన్,  త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టి ప్రస్తుత మంత్రులుగా కొనసాగుతున్న కొంతమందిని తప్పించి , మరి కొంత మందిని క్యాబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Telugu Ap, Chandrababu, Jagan, Kavuru Srinivas, Taneti Vanitha, Ysrcp-Politics

తాజాగా ఏపీ క్యాబినెట్( AP Cabinet ) సమావేశంలోనే దీనికి సంబంధించిన  సంకేతాలను జగన్ ఇచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు కొన్నిచోట్ల ఎన్నికలు జరిగాయి.ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంది .ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యతలను మంత్రులకు జగన్ అప్పగించారు.ఇక ప్రస్తుతం మంత్రివర్గంలో కొనసాగుతున్న సిదిరి అప్పలరాజు ( Sidiri Appalaraju ),  చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ,  దాడిశెట్టి రాజా , పినిపే విశ్వరూప్తానేటి వనిత( Taneti Vanita ),  నారాయణస్వామి , గుమ్మనూరు జయరాం వంటి వారిని తప్పించే అవకాశం ఉన్నట్లుగా వైసిపి లో ప్రచారం జరుగుతుంది.వారి స్థానంలో కొత్తగా ఎమ్మెల్సీలుగా పోటీచేసిన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కౌరు శ్రీనివాస్, చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన మర్రి రాజశేఖర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులకు మంత్రులుగా అవకాశం దక్కపోతున్నట్లుగా వైసీపీలో ప్రచారం జరుగుతోంది.

మర్రి రాజశేఖర్ కు గతంలోని ఎమ్మెల్సీ ఆఫర్ ఇవ్వడంతో పాటు , మంత్రి పదవి ఇస్తామని జగన్ హామీ ఇవ్వగా,  కౌరు శ్రీనివాస్, తోట త్రిమూర్తులను సామాజిక వర్గం కోణంలో అవకాశం కల్పించబోతున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube