అతిలోక సుందరి శ్రీదేవి( Sridevi ) నట వారసురాలు జాన్వీ కపూర్( Janhvi Kapoor ) తెలుగు లో ఎన్టీఆర్30 సినిమా తో ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే.మూడు నాలుగు సంవత్సరాలుగా తెలుగు లో జాన్వీ కపూర్ ఎంట్రీ గురించిన ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
ఎట్టకేలకు జాన్వీ కపూర్ యొక్క మొదటి తెలుగు సినిమా కన్ఫర్మ్ అవ్వడంతో శ్రీదేవి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.బాలీవుడ్ లో జాన్వీ కపూర్ యొక్క సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.
అయినా కూడా టాలీవుడ్ లో ఈమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.కనుక తప్పకుండా తెలుగు లో జాన్వీ కపూర్ స్టార్ హీరోయిన్ గా మారడం ఖాయం అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ కు ఉన్న ఫాలోయింగ్ నేపథ్యంలో తెలుగు లో కచ్చితంగా మొదటి సినిమా తోనే మంచి పాపులారిటీని దక్కించుకునే అవకాశం ఉంది.

హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎన్టీఆర్( NTR ) సినిమా తర్వాత కచ్చితంగా స్టార్ హీరోల మోస్ట్ వాంటెడ్ గా జాన్వీ కపూర్ నిలిచే అవకాశాలు ఉన్నాయి.దాంతో ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ గా మోస్ట్ బిజీ హీరోయిన్స్ గా దూసుకు పోతున్న ముగ్గురు ముద్దుగుమ్మలు పూజా హెగ్డే.రష్మిక మందన్న.
శ్రీలీలలు ఆఫర్లు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి.ఒక వేళ జాన్వీ ఎక్కువగా బాలీవుడ్ పైనే దృష్టి పెడితే మాత్రం ఈ ముగ్గురు హీరోయిన్స్ కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుంది.

ఈ ముగ్గురు హీరోయిన్స్ కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో జాన్వీ కపూర్ యొక్క ఎంట్రీ గురించి టెన్షన్ పడుతూ ఉంటారని కూడా ప్రచారం జరుగుతోంది.శ్రీదేవి నట వారసురాలు అయిన జాన్వీ కపూర్ కు తెలుగు లో దక్కే గుర్తింపు ఏ పాటిదో అనేది తెలియాలంటే వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు వెయిట్ చేయాల్సిందే.ఎందుకంటే ఎన్టీఆర్ 30 సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ కి గాని ప్రేక్షకుల ముందుకు రాదు.ఒక వైపు ఎన్టీఆర్ తో సినిమా ను చేస్తూనే మరో వైపు రామ్ చరణ్ కి కూడా జోడీగా ఈ అమ్మడు నటించే అవకాశాలున్నాయి.







