తెలంగాణ రాజకీయాలు హుజురాబాద్ ఉప ఎన్నికల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే.త్వరలో జరగబోయే ఉప ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలు రెడీ అవుతున్నాయి.
ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ..
అభ్యర్థిని ప్రకటించడం జరిగింది.మాజీ మంత్రి ఈటల రాజేందర్.
రాజీనామాతో జరగబోయే ఉప ఎన్నికలలో పోటీ ఎక్కువగా టిఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంటుందని విశ్లేషకుల అంచనా.ఈ నియోజకవర్గంలో చాలా వరకు బడుగు బలహీన వర్గాల కుటుంబాలు ఉండటం తో.సీఎం కేసీఆర్ ప్రకటించిన దళిత బందు పథకం అమలు ఇప్పుడు సంచలనంగా మారింది.

ఈనెల 16వ తారీకు నుండి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఒక్కో దళిత కుటుంబనికి 10 లక్షలు అందించడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం రెడీ అయింది.ఇందుకోసం ఇప్పటికే 500 కోట్లు మంజూరు చేయడం జరిగింది.అంతే కాకుండా ఇటీవల ప్రగతిభవన్లో దళిత బందు పథకం అమలుపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశానికి మంత్రి హరీష్ రావు తో పాటు టిఆర్ఎస్ అభ్యర్థి గెలు శ్రీనివాస్ హాజరయ్యారు.ఖచ్చితంగా పగడ్బందీగా దళిత బందు పథకాన్ని అమలు చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సన్నద్ధమైంది.
హుజరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని ఈ నెల 16న ప్రారంభించనుంది.ఈ క్రమంలో దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక, నగదు జమ, యూనిట్లను సిద్ధం చేయడం తదితర అంశాలపై సీఎం దిశనిర్దేశం చేయడం జరిగింది.