యూకలిప్టస్ ఆయిల్.దీనినే తెలుగులో నీలగిరి తైలం అని పిలుస్తారు.
ఘాటైన సువాసన కలిగి ఉండే యూకలిప్టస్ ఆయిల్ గురించి చాలా మందికి పెద్దగా అవగాహనే లేదు.కానీ, ఆరోగ్య పరంగా యూకలిప్టస్ ఆయిల్ ఎన్నో బెనిఫిట్స్‌ను అందిస్తుంది.
మరి ఆ బెనిఫిట్స్ ఏంటీ.? అసలు యూకలిప్టస్ ఆయిల్‌ను ఎలా యూజ్ చేయాలి.? వంటి విషయాలు ఏ మాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
బాడీ పెయిన్స్‌ను నివారించడంలో యూకలిప్టస్ ఆయిల్ ఒక మెడిసిన్‌లా పని చేస్తుంది.
అవును, ఎవరైతే ఒంటి నొప్పులతో బాధ పడుతున్నారో వారు ఒక బకెట్ వేడి నీటిలో అర స్పూన్ యూకలిప్టస్ ఆయిల్ వేసుకుని బాగా కలిసి.స్నానం చేయాలి.
ఇలా చేస్తే ఒళ్లు నొప్పులన్నీ ఇట్టే పరార్ అవుతాయి.

గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి, కడుపు ఉబ్బరం సమస్యలను తగ్గించడంలోనూ యూకలిప్టస్ ఆయిల్ ఉపయోగపడుతుంది.అందు కోసం ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటితో రెండు చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ యాడ్ చేసుకుని సేవించాలి.తద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గు ముఖం పట్టి జీర్ణ వ్యవస్థ బలపడుతుంది.

అలాగే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడే వారు ఒక గిన్నెలో నీటిని తీసుకుని బాగా మరిగించాలి.ఆపై అందులో ఐదారు చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ కలిసి.కాసేపు ఆవిరి పట్టాలి.ఇలా రోజుకు ఒక సారి పడితే.జలుబు, దగ్గు, గొంతు నొప్పితో పాటుగా ఆస్తమా లక్షణాల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది.
ఇక నడుము నొప్పి, తల నొప్పి, మోకాళ్ల నొప్పి, మడమ నొప్పి, మెడ నొప్పి వంటి వాటిని తగ్గించుకోవడం కోసం యూకలిప్టస్ ఆయిల్‌ను వాడొచ్చు.
అవును, ఎక్కడైతే నొప్పి పుడుతుందో.అక్కడ కాస్త యూకలిప్టస్ ఆయిల్‌తో మసాజ్ చేసుకుంటే క్షణాల్లో నొప్పి తగ్గుతుంది.