1.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 12, 729కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
2.డ్రగ్స్ కేసులో ఎన్సీబీ ముందుకు ఆర్యన్ ఖాన్

ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ పై బయట ఉన్నారు.అయితే ప్రతి శుక్రవారం ఆయన ఎన్సీబీ ముందు హాజరు కావాలంటూ కోర్టు షరతు విధించడంతో ఈరోజు ఎన్సీబీ విచారణ ఆర్యన్ ఖాన్ హాజరయ్యారు.
3.కేంద్రం ఏపీ ప్రభుత్వం పై మాజీ ఎంపీ విమర్శలు
కేంద్రఒలి బిజెపి, ఏపీలో వైసీపీ ప్రభుత్వం పై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ చింతా మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు.
4.కేదార్నాథ్ లో ప్రధాని పూజలు

ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కేదార్ నాథ్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
5.నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు
ఏపీలో పెండింగ్ లో ఉన్న మున్సిపల్ , స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నేటితో నామినేషన్ గడువు పూర్తి కానుంది.
6.ధాన్యం కేంద్రమే కొనాలి : టీఆర్ఎస్

రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనాలి అని టీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.
7.యాదాద్రిలో నేటి నుంచి పుష్పాలంకరణ, సేవా దర్శనం
ప్రముఖ పుణ్య క్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేటి నుంచి పుష్పాలంకరణ, సేవా దర్శనం ను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
8.షర్మిల పాదయాత్ర

వైయస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేటికి 17వ రోజుకు చేరింది.
9.తిరుమల సమాచారం
తిరుమల లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.గురువారం తిరుమల శ్రీవారిని 25,924 మంది భక్తులు దర్శించుకున్నారు.
10.తెలంగాణాల కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 106 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
11. హరీష్ రావు పై ఈటెల రాజేందర్ ఆగ్రహం

టిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు పై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
12.జగన్ కు హరి రామ జోగయ్య లేఖ
ఏపీ సీఎం జగన్ కు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య లేఖ రాశారు.ఈ బి సి రిజర్వేషన్ లో కాపులకు కేటాయించిన ఐదు శాతం రిజర్వేషన్లను పక్కన పెట్టే విధంగా మరో జీవోను విడుదల చేయడం సరికాదని లేఖలో పేర్కొన్నారు.
13.సింహాద్రి అప్పన్న సేవలో స్వరూపానంద

శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి శుక్రవారం సింహాద్రి అప్పన్న ను దర్శించుకున్నారు.
14.మహా పాదయాత్ర కు సంఘీభావం
అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్ర కు అనేక పార్టీలకు చెందిన పలువురు సంఘీభావం తెలిపారు.
15.చంద్రబాబు కామెంట్స్

విజయనగరం జిల్లా లచ్చయ్య పేట లో చెరుకు రైతుల బకాయిలు చెల్లించాలని నిరసన తెలుపుతున్న రైతులపై అక్రమ కేసులు బనాయించడం సరికాదని టిడిపి చంద్రబాబు ఏపీ ప్రభుత్వం పై విమర్శలు చేశారు.
16.వైసీపీ పై ఎస్.ఈ.సీ కి టిడిపి ఫిర్యాదు
వైసీపీ ప్రభుత్వం పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది.
17.జగన్ ను కలిసిన నావికాదళం అధికారులు

ఏపీ సీఎం జగన్ ను నావికాదళం అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు .తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ , వైస్ అడ్మిరల్ రాజేంద్ర బహుదూర్ కలిశారు.
18.ఎన్టీఆర్ చేతికి సర్జరీ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతికి గాయం అయ్యింది.ఇటీవల తన ఇంట్లో జిమ్ లో వ్యాయామం చేస్తుడగా ఆయన కుడి చేతికి గాయం కావడంతో నాలుగు రోజుల క్రితం సర్జరీ చేసినట్టు సమాచారం.
19.ఏపీ సచివాలయంలో ఉద్యోగుల హజరుపై ప్రభుత్వం ఆగ్రహం

ఏపీ సచివాలయంలో కొంతమంది ఉద్యోగులు అధికారులు సక్రమంగా విధులకు హాజరు కాకపోవడం పై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.ఉదయం 11 గంటల తరువాత మాత్రమే విధులకు హాజరవుతున్న కొంత మంది ఉద్యోగులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేసింది.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,400 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,400