టాలీవుడ్ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఎందుకంటే ఈయన ఒక నటుడిగానే కాకుండా మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిగా కూడా అభిమానుల హృదయాలలో నిలిచాడు.
ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.టాలీవుడ్ ఇండస్ట్రీలోనే.
బాలీవుడ్ స్టార్ హీరోల కంటే ఎక్కువ క్రేజ్ ని సంపాదించుకున్నాడు.ఇదిలా ఉంటే ప్రభాస్ విందుకు శృతిహాసన్ బాగా షాక్ అయ్యింది.
నిజానికి ప్రభాస్ మనస్తత్వం గురించి ఆయనతో నటించిన వాళ్ళు చాలాసార్లు తెలిపారు.మేకప్ మాన్ నుండి ప్రతి ఒక్కరిని గౌరవంగా అభినందిస్తాడు.తన ఇంటి నుండి తయారుచేసిన వంటకాలను కూడా షూటింగ్ లో ఉండేవాళ్లకు రుచి చూపిస్తుంటాడు.రకరకాల వంటకాలను ప్రత్యేకంగా తయారు చేయించి తనతో నటించే నటులకు కూడా చాలాసార్లు రుచి చూపించాడు.
ప్రభాస్ ఇంట్లో గోదావరి వంటకాలు బాగా ఫేమస్.ఆ మధ్య రాధేశ్యామ్ సినిమా సమయంలో అందులో నటించిన నటి భాగ్యశ్రీ కి కూడా తన ఇంటి వంట రుచులను చూపించాడు.
ఇక తాజాగా శృతిహాసన్ కూడా రుచి చూపించాడు.ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ప్రభాస్ తన సరసన నటించిన నటులు అందరికీ వంటకాలు రుచులు చూపించగా.
ప్రస్తుతం శృతి హాసన్ కు కూడా చూపించాడు.ఏకంగా 20 వెరైటీ వంటకాలతో విందు ఏర్పాటు చేసి శృతిహాసన్ కు షాకిచ్చాడు.
అందులో స్పెషల్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, గోంగూర మాంసం ఇలా పలు రకాల వంటకాలను వండించి శృతి హాసన్ కు అందించాడట.
![Telugu Salaar, Shruti Haasan, Dishes, Tollywood-Movie Telugu Salaar, Shruti Haasan, Dishes, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2021/08/Prabhas-Surprise-Shruti-Haasan.jpg )
ఈ విషయాన్ని శృతి హాసన్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.ఈ వంటలన్నీ చూసి బాగా థ్రిల్ అయ్యానని తెలిపింది.అంతేకాకుండా ప్రభాస్ కు ధన్యవాదాలు కూడా తెలిపింది.
ఇక ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ లో నటించగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఇక ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.