ప్రస్తుతం రాష్ర్టం మొత్తం హుజూరాబాద్ వైపుకు చూస్తుంది.ఇటువంటి తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికలను సర్కారు వాయిదా వేయమని కోరడం చాలా విడ్డూరంగా ఉందని చాలా మంది రాజకీయ విశ్లేషకులతో పాటు అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు జరపడానికి కరోనా కంగారును రాష్ర్ట ప్రభుత్వం సాకుగా చూపెట్టడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.అసలు ఎమ్మెల్యే ఎలక్షన్లతో పోల్చుకుంటే ఎమ్మెల్సీ ఎన్నికలు పెద్ద విషయం కాదని అంతలా మంది గుమిగూడే అవకాశం లేదనేది వాస్తవం కానీ సర్కారు మాత్రం కరోనా సాకు చూపి ఎన్నికల సంఘానికి లేఖ రాయడం గమనార్హం.
అసలు కారణం వేరే ఉందని చాలా మంది చెవులు కొరుక్కుంటున్నారు.ఇలా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా వేయడం వెనుక హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం పై ఆందోళన కనిపిస్తోందని అంటున్నారు.
ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా వర్గాల్లోని చాలా మందికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని హామీ ఇచ్చారు.అలా ఇచ్చుకుంటూ పోయేందుకు సరిపడా స్థానాలు లేవు.ప్రస్తుత తరుణంలో ఎవరికి పదవి ఇవ్వకపోయినా వారు తిరుగు బావుట ఎగరేసే అవకాశం లేకపోలేదు.ఇది హుజూరాబాద్ ఉప ఎన్నిక మీద ప్రభావం పడుతుందని భావించే ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా వేసినట్టు చాలా మంది చెబుకుంటున్నారు.
ప్రస్తుతం హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ ను ఓడించాలంటే అన్ని కులాల వారి మద్దతు తప్పని సరి అని భావిస్తున్న టీఆర్ఎస్ సర్కారు ఎవరినీ దూరం చేసుకోవడం ఇష్టం లేకే ఉప ఎన్నిక వాయిదా వేసిందని చాలా మంది గుసగుసలాడుకుంటున్నారు.అసలు సభలు, సమావేశాలు నిర్వహిస్తే రాని కరోనా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తే వస్తుందని చెప్పడం నమ్మేలా లేదని చాలా మంది అంటున్నారు.
ఇవ్వన్నీ హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎటువంటి ప్రతికూలతలు లేకుండా చూసుకునేందుకే ప్రభుత్వం చేస్తోందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.