ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్న నటులంతా హీరోలుగా అవకాశాలను అందిపుచ్చుకోకముందే బాల నటులుగా నటించారనే సంగతి తెలిసిందే.జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు హీరోలుగా ఎంట్రీ ఇవ్వకముందే బాలనటులుగా నటించారు.
అయితే రామ్ చరణ్ మాత్రం బాలనటుడిగా నటించినట్టు ఎవరికీ తెలియదు.అయితే చిరంజీవి బాలనటుడిగా ఒక సినిమాలో నటించారు.
రామ్ చరణ్ నటించిన చిరంజీవి సినిమా కావడం గమనార్హం.దాసరి నారాయణరావు డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా తెరకెక్కిస్న లంకేశ్వరుడు సినిమాలో చరణ్ బాలనటుడిగా నటించారని సమాచారం.
చిన్నప్పుడు చాలా క్యూట్ గా ఉన్న చరణ్ ను చాలామంది దర్శకులు బాలనటుడిగా చూపించాలనే ప్రయత్నాలు చేసినా దాసరి నారాయణరావుకు మాత్రమే ఆ అవకాశం దక్కడం గమనార్హం.
అయితే చరణ్ నటించిన సన్నివేశాలు ఎడిటింగ్ లో తీసేయడంతో మనం చరణ్ ను బాలనటుడిగా చూడలేకపోయాం.
ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ట్రిపుల్ ఆర్ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ ఆచార్య మూవీలో కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.చిరుత సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన రామ్ చరణ్ సినీ కెరీర్ లో హిట్లతో పాటు ఫ్లాప్ లు కూడా ఉండటం గమనార్హం.
చిరంజీవి, దాసరి నారాయణరావు కాంబినేషన్ లో తెరకెక్కిన ఒకే సినిమా లంకేశ్వరుడు సినిమా మాత్రమే కావడం గమనార్హం.అయితే సినిమాలో చరణ్ కనిపించకపోయినా ఆ సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ లో మాత్రం చరణ్ కనిపించడం గమనార్హం.చరణ్ నటించిన సన్నివేశాలు తొలగించకపోయి ఉంటే బాగుండేదని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.మరోవైపు చరణ్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనుండగా ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియాల్సి ఉంది.