ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.పార్లమెంటు ఎన్నికలు జరిగిన తర్వాత పెద్దగా ఏ ఎన్నికల్లోనూ ప్రభావం చూపలేకపోయింది.
దీంతో రాజ్యసభలో బీజేపీకి బలం తగ్గిపోతోంది.ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ ఈనెల 10న ఢిల్లీ వెళ్లడం ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపింది.
ప్రతిసారి ఆయన ఢిల్లీ వెళ్లినప్పుడు కేసుల మాఫీ కోసమంటూ లేదా కేంద్ర కేబినెట్‌లో చేరతారంటూ ప్రచారం జరిగేది.
అయితే ఈ సారి జగన్ 10న ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రులను కలిసారు.
చాలా రోజుల తర్వాత అమిత్‌సాతో గంటన్నరకు పైగా భేటీ అయ్యారు.ఆ తర్వాత ఆయన ఏపీకి వచ్చేశారు.
అయితే జగన్ వచ్చిన తర్వాత 11నాడు నరేంద్రమోడీ అమిత్ షా, నడ్డాతో భేటీ అయ్యారు.దీంతో మంత్రి వర్గంలో విస్తరణ ఉంటోందంటూ వార్తలు వచ్చాయి.
ఇప్పుడు రాజ్యసభలో బీజేపీకి బలం తక్కువగా ఉండటంతో దానిపై దృష్టి పెట్టారు కమలనాథులు.ఇందులో భాగంగానే కేంద్ర కేబినెట్‌లో చేరాలంటూ వైసీపీపై ఎప్పటి నుంచో బీజేపీ ఒత్తిడి తెస్తోంది.
అయితే పార్లమెంట్‌లో బీజేపీకి వైసీపీ ఎప్పటి నుంచో మద్దతు ప్రకటిస్తూనే ఉంది.ఈ క్రమంలోనే కేంద్ర కేబినెట్‌లో వైసీపీని చేర్చుకుంటే రాజ్యసభలో బలం పెంచుకోవచ్చని బీజేపీ భావిస్తోంది.ఇందుకోసం వైసీపీకి రెండు కేబినెట్ పదవులతో పాటు ఒక సహాయమంత్రి పదవిని కూడా ఆఫర్‌చేసినట్టు తెలుస్తోంది.మొన్న జగన్ తో అమిత్ షా కూడా వీటినే ప్రస్తావనకు తెచ్చారని సమాచారం.
మరి జగన్ బీజేపీ ఆఫర్‌ను ఒప్పుకుంటారా లేదా అన్నది చూడాలి.ఒకవేళ ఒప్పుకుంటే మాత్రం విజయసాయిరెడ్డికి, తిరుపతి ఎంపీ గురుమూర్తికి పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
సహాయ మంత్రి పదవిని కోస్తాంధ్ర జిల్లాల్లోని ఓ ఎంపీకి ఇవ్వనున్నట్టు సమాచారం.చూడాలి మరి జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో.