సాధారణంగా మొటిమలు, మచ్చలు వచ్చాయంటే వాటిని తగ్గించుకునేందుకు ఖరీదైన క్రీములు, లోషన్లు, ఆయిల్స్ కొనుగోలు చేసి వాడతారు.కొందరు ఏవేవో ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటారు.
కానీ, ఇంట్లోనే ఎలాంటి ఖర్చు లేకుండా ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చని మాత్రం తెలుసుకోరు.నిజానికి వంటింట్లో ఉండే ఎన్నో కూరగాయలు చర్మ సంరక్షణకు అనేక విధాలుగా ఉపయోగపడతాయి.
మరి వేటిని ఎలా వాడాలి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
మొటిమలను, మచ్చలను నివారించి చర్మ కాంతిని పెంచడంలో దోసకాయ గ్రేట్‌గా సహాయపడుతుంది.
ఒక బౌల్లో దోసకాయ రసం తీసుకుని అందులో ఎగ్ వైట్, పెరుగు మరియు కొద్దిగా నిమ్మ రసం మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని పావు గంట తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా డే బై డే చేయడం వల్ల మొటిమలు, మచ్చలు మాయమై ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.
అలాగే బీట్రూట్ కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. బీట్ రూట్‌ను ఉడకబెట్టి పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్‌లో కొద్దిగా పాలు వేసి కలుపుకుని ముఖానికి పట్టించాలి.
బాగా డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా వారంలో మూడు సార్లు చేస్తే మొటిమలతో పాటు వాటి తాలుకు మచ్చలను కూడా పూర్తిగా పోతాయి.
ఇక వంకాయ కూడా చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి.వంకాయను పేస్ట్ చేసి అందులో కొద్దిగా కలబంద గుజ్జు వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు బాగా పట్టించి ముప్పై నిమిషాల పాటు ఆరనివ్వండి.ఆ తరువాత గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు పరార్ అవ్వడంతో పాటు చర్మం నిగనిగలాడుతూ మెరుస్తుంది.