ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుత సమాజంలో బట్టతలతో( Bald Head ) బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది.జుట్టు రాలుతుంటే ఆడవారైనా, మగవారైనా మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు.
కొంతమంది అయితే హెయిర్ ఫాల్( Hair Fall ) కావడం వల్ల డిప్రెషన్కు కూడా వెళ్తారు.ఎందుకంటే మనిషికి హెయిర్ అనేది ఆత్మవిశ్వాసం, అందాన్ని కూడా పెంచుతాయి.
బట్టతలపై వెంట్రుకలు రావడానికి ముఖ్యంగా పురుషులు ఎంతో కష్టపడుతుంటారు.ఇంకా వివాహం కాని వారి పరిస్థితి అయితే ఎంతో దారుణంగా ఉంటుంది.
వీరు ఆన్లైన్లో లభించే హెయిర్ ఆయిల్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు.ఈ బట్టతల కవర్ చేసుకోవడానికి కొందరు టోపీ( Hat ) కూడా పెట్టుకుంటూ ఉంటారు.అయితే టోపీ పెట్టుకోవడం వల్ల, హెల్మెట్ పెట్టుకున్న బట్టతల వస్తుందని, హెయిర్ లాస్ అవుతుందని కొందరు భావిస్తూ ఉంటారు.ఇలాంటి అనుమానాలు వెంటాడుతున్న వారి కోసం ఏమి చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు రాలిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
కేవలం టోపీ పెట్టుకోవడం వల్ల బట్టతల వస్తుందని అనుకోవడం అపోహ అని నిపుణులు చెబుతున్నారు.హార్మోన్లలో తేడాలు, జన్యుపరమైన మార్పులు తీసుకునే ఆహారం వల్ల జుట్టు రాలిపోతుంది.టోపీ పెట్టుకునేది తల వేడెక్కకుండా ఉండడం కోసం మాత్రమే కానీ బిగుతుగా ఉంటే టోపీలు పెట్టుకోవద్దని సూచిస్తున్నారు.
దీని వల్ల చెమట పెరిగే బ్యాక్టీరియా( Bacteria ) వృద్ధి చెందుతుంది.అలాగే సరైన నిద్ర లేకపోతే మానసిక ఒత్తిడి పెరిగి ఆ ప్రభావం జుట్టుపై పడి హెయిర్ లాస్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడి వల్ల హార్మోన్లు( Harmones ) అనేవి ఇన్ బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి.ప్రతిరోజు తప్పకుండా ఏడు గంటల నుంచి 8 గంటలు నిద్రపోవాలి.ప్రస్తుత సమాజంలో జంక్ ఫుడ్ ప్రాసెస్ ఫుడ్ తినే వారి సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.ఈ ఆహారం తీసుకోవడం వల్ల జుట్టుకు రక్తప్రసరణ అందదు.అలాగే కుదుర్లు బలహీనంగా మారి జుట్టు రాలడం మొదలవుతుంది.వ్యాయామం చేయకపోవడం వల్ల తనపై రక్త ప్రసరణ సరిగ్గా జరగదు.
దీంతో రాలిపోయే అవకాశాలు ఉన్నాయి.అలాగే మహిళలు, గర్భిణీలు మాత్రలు ఉపయోగించిన జుట్టు లాస్ అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.