తెలంగాణాలో మెడికల్ కాలేజ్ లకు కేసిఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.రాష్ట్రంలో మరో 10 మెడికల్ కాలేజ్ లు ఏర్పాటు చేసేలా చూస్తున్నారు.
దీనిలో భాగంగా సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ ప్రకటించారు.సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ ప్రకటించినందుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి సిఎం కేసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఆయన అన్నారు.కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం తాను పోరాటం చేస్తున్నానని చెప్పారు జగ్గారెడ్డి.
సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ 10 నియోజగక వర్గాల ప్రజలతో పాటుగా బీదర్ నుండి వచ్చే వారికి ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు.తాను అసెంబ్లీలో టైం వచ్చిన ప్రతిసారి మెడికల్ కాలేజ్ గురించి ప్రస్థావించానని.
కూతురుతో కలిసి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుండి అసెంబ్లీకి పాదయాత్ర కూడా చేశానని జగ్గా రెడ్డి అన్నారు.కేసిఆర్ సభలో తనకు మాట ఇచ్చారు.సంగారెడ్డి మెడికల్ కాలేజీ ఉన్న భూముల్లోనే నిర్మాణం చేయాలని కోరారు.సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే ఎమ్మెల్యేగా తనకు సిఎంగా కేసిఆర్ కు మంచి పేరు వస్తుందని అన్నారు జగ్గారెడ్డి.
శంకుస్థాపన రోజు కేసిఆర్ అనుమతిస్తే తనకు భారీ సన్మానం చేస్తానని ఇది పార్టీతో సంబంధం లేదని తన వ్యక్తిగతమని అన్నారు జగ్గా రెడ్డి.