ఎన్నో పనులు చేయాలి అనుకుంటాం.కానీ కొన్నింటిని చేయలేం.
అలాగే టాప్ సినిమా హీరోలు అయినా.కొన్ని సినిమాలను చేయలేకపోతారు.
దానికి కారణాలు అనేకం ఉంటాయి.అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలోనూ కొన్ని సినిమాలు ఆగిపొయారు.
సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత సెట్స్ మీదకు వెళ్లకుండానే డస్ట్ బిన్ లో పడ్డాయి.ఇంతకీ ఆ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గుణశేఖర్ మూవీ
అర్జున్ మూవీ తర్వాత గుణశేఖర్ డైరెక్షన్ లో ఎం ఎస్ రాజు ఓ మూవీకి ఓకే చెప్పారు.దానికి సైన్యం అని పేరు కూడా కన్ఫాం చేశారు.అప్పటికే పోకిరి బ్లాక్ బస్టర్ కావడంతో మహేష్ ఇమేజ్ కి సైన్యం సరిపోదని భావించారు.ఇంతలో సైనికుడు మూవీ కూడా ప్లాప్ కావడంతో సైన్యం నిలిచిపోయింది.
జాస్తి హేమాంబర్ మూవీ
అటు తన మూవీస్ కు అసోసియేట్ గా చేస్తున్న జాస్తి హేమాంబర్ కు మహేష్ ఛాన్సిచ్చాడు.2007లో దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద సినిమా చేయడానికి సిద్దమై, మిర్చి టైటిల్ కూడా పెట్టేసారు.ఖలేజా మూవీ ఆలస్యం కావడంతో హేమాంబర్ కి ఛాన్స్ పోయింది.
ఆర్ ఆర్ మూవీ మేకర్స్ మూవీ
ఆర్ ఆర్ మూవీ మేకర్స్ వరుడు మూవీని హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేయడానికి ప్రకటన చేసారు.ఖలేజా జాప్యం వలన ఇది ముందుకి వెళ్ళలేదు.
సురేందర్ రెడ్డి మూవీ
ఆర్ ఆర్ వెంకట్ నిర్మాతగా మిస్టర్ ఫర్ఫెక్ట్ మూవీని సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో చేయడానికి మహేష్, కరీనా కపూర్ కాంబోలో 2010లో ప్రకటించారు.రూ.40 కోట్లతో తీస్తున్నట్లు ప్రకటించిన ఈ మూవీ దూకుడు తర్వాత ఆగిపోయింది.
బోయపాటి శ్రీను
కె రమేష్ బాబు నిర్మాతగా బోయపాటి డైరెక్షన్ లో 2011లో ఓ పవర్ ఫుల్ మూవీ ప్రకటన వచ్చినా, తర్వాత దాని ప్రస్తావన లేదు.
మణిరత్నం మూవీ
మణిరత్నం డైరెక్షన్ లో 2013లో వీరుడు అనే మూవీ ప్రకటించారు.స్వయంగా మణిరత్నం ప్రకటించినప్పటికీ ఎందుకో ఆగిపోయింది.
త్రివిక్రం మూవీ
అత్తారింటికి దారేది సినిమా తర్వాత మహేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో హరే రామ హరే కృష్ణ మూవీ ప్రకటించారు.ఎం ఎస్ రాజు, హారిక హసీని సంస్థ గానీ నిర్మిస్తుందని అనుకున్నా కార్యరూపం దాల్చలేదు.
పూరీ జగన్నాథ్ మూవీ
2016లో పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో జన గణ మన మూవీ వస్తుందని భావించారు.ఫాన్స్ కూడా బాగా ఎదురు చూసారు.రకరకాల కారణాల వలన ఆగిపోయింది.
వంశీ పైడిపల్లి మూవీ
సరిలేరు నీకెవ్వరూ మూవీ తర్వాత వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో గ్యాంగ్ స్టర్ తరహా మూవీ చేయాలను కున్నారు.అటు సర్కారువారిపాట మూవీ కి కమిట్ అవ్వడంతో అది ఆగిపోయింది.