తాజాగా తాను కరోనా వైరస్ కారణంగా చనిపోయాను అంటూ వస్తున్న వార్తల పై బాలీవుడ్ దిగ్గజ నతుడైన ముఖేష్ ఖన్నా తన అసంతృప్తిని వ్యక్తపరిచారు.తనకు ఎలాంటి కరోనా వైరస్ సొకలేదని, తాను పూర్తి ఆరోగ్యంతో బాగానే ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో ప్రజలకు క్లారిటీ ఇచ్చాడు.ఇందులో భాగంగానే తాను మీ ఆశీస్సుల వల్ల చాలా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని తాను కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చేరానని వచ్చిన వార్తలన్నీ అవాస్తవమని చెప్పుకొచ్చాడు.
నిజానికి తనకు అసలు కరోనా వైరస్ రాలేదని వార్తలన్నీ ఒట్టి పుకార్లే అని తేల్చేశాడు.అసలు ఇలాంటి పుకార్లు ఎవరు సృష్టిస్తున్నారో ఏ ఉద్దేశంతో వాటిని ప్రచారం చేస్తున్నారో తనకు అర్థం కావట్లేదని వారిని ఏం చేస్తే ఇలాంటి మానేస్తారు అంటూ ప్రశ్నించాడు.
ముఖ్యంగా ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందిందని అసలు సమస్య సోషల్ మీడియా వల్ల వస్తోందని తెలియజేశాడు.ఆయన కానీ ఇలాంటి ఫేక్ వార్తలతో ప్రజల ఎమోషన్ లతో ఆడుకోవడం చాలా దారుణం అని దానికి బాధ్యులైన వారిని శిక్షించాలని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం తనపై వచ్చిన వార్తలకు తాను పూర్తిగా విసిగిపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.
తనకి ఎలాంటి కరోనా వైరస్ రాకున్న కానీ తనకి కరోనా వైరస్ వచ్చిందని దానిని అధిగమించలేక బతికుండగానే చనిపోయాడు అంటూ పుకార్లు లేపడం చాలా బాధాకరమైన విషయం అని తెలియజేశాడు.ఇది కేవలం ఆ విషయంలో మాత్రమే కాకుండా ఈ మధ్య కాలంలో గాయకుడు లక్కీ అలీ కూడా చనిపోయాడు అంటూ పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి.ఇలా బతికుండగానే మమ్మల్ని చంపేస్తున్నారు అంటూ ముఖేష్ ఖన్నా విచారం వ్యక్తం చేశారు.
ఇకపోతే ముఖేష్ కన్నా సినిమాల్లో నటించడమే కాకుండా టీవీ షోలలో కూడా ఆయన నటించారు.శక్తిమాన్ గా వచ్చిన సీరియల్ లో ఆయన అద్భుత నటనతో అమితమైన పాపులారిటీని దేశవ్యాప్తంగా సంపాదించుకున్నాడు.