మామూలుగా పెళ్ళి తంతు అంటే తాటాకు పందిళ్ళు, సాంప్రదాయపు అలవాట్లు, పెద్దల హడావిడి ఇలా రకరకాల సాంప్రదాయాలతో ముందుకు సాగుతూ ఉండేది.అయితే ప్రస్తుతం జరుగుతున్న పెళ్లిళ్ల స్టైల్ పూర్తిగా మారిపోయింది.
సంగీత్ కార్యక్రమం, బారాత్ కార్యక్రమము రిసెప్షన్ అంటూ వివిధ రకాల ఎన్నో ఆర్భాటాలు చేస్తూ పెళ్ళి తంతును ముగిస్తున్నారు.అయితే ఇవన్నీ కూడా నిన్నమొన్నటి వరకు ప్రస్తుతం కరోనా సమయం వచ్చింది.
దీంతో మళ్లీ పెళ్లి తంతు పూర్తిగా మారిపోయింది.ప్రస్తుతం కరోనా సమయంలో జరుగుతున్న పెళ్లిళ్ల కార్యక్రమాల్లో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా కేవలం ఇంటి మటుకు వ్యక్తులు మాత్రమే హాజరు అవుతూ పెళ్లిళ్ల కార్యక్రమాలను ముగిస్తున్నారు.
స్నేహితులు, చుట్టాలు లేకుండా.కేవలం 20 నుండి 50 మంది మనుషుల మధ్య పెళ్లిళ్ల కార్యక్రమాల్ని అతి సింపుల్ గా జరుపుకుంటూ పోతున్నారు ప్రజలు.
ఇక అసలు విషయంలోకి వెళితే.
బైక్ పై చాలా సింపుల్ గా వెళుతున్న అప్పుడే పెళ్లి చేసుకున్న ఓ నూతన జంటకు తాజాగా పోలీసులు సన్మానం చేశారు.
మామూలుగా పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి బారాత్ అంటే ఏ రేంజ్ లో హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.వారు ప్రయాణిస్తున్న మార్గం మొత్తం డీజే సాంగ్స్, తీన్మార్ డాన్స్ లతో నానా హంగామా జరుగుతుంది.
ఇకపోతే ప్రస్తుతం లాక్ డౌన్ జరుగుతున్న నేపథ్యంలో ఓ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇద్దరూ పెళ్లి దుస్తుల్లోనే వారు చేరుకోవాల్సిన ప్రదేశానికి బయలుదేరారు.అయితే ఇలా వెళుతున్న వారిని స్థానిక పోలీసులు రోడ్డుపై ఆపారు.
కరోనా సమయంలో కరోనా కట్టడికి దంపతులు ఇద్దరూ చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నందుకు, అలాగే ఎలాంటి హంగామా లేకుండా.బైక్ పై వెళ్తున్న అందుకు నిబంధనలు పాటించేందుకు కొత్త జంటను పోలీసులు పూలమాలతో సన్మానించారు.
అంతేకాదండోయ్.ఆ జంటకు కాస్త నగదు బహుమతిని కూడా పోలీసులు బహుకరించారు.
అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో పూర్తి వివరాలు తెలియకపోయినప్పటికీ.వీడియో చూస్తే మాత్రం పంజాబ్ రాష్ట్రంలో జరిగినట్లుగా తెలుస్తోంది.
ఇలా నిరాడంబరంగా పెళ్లి చేసుకున్న దంపతులను సోషల్ మీడియాలో నెటిజన్లు ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.