రాష్ట్రంలో కరోనా విలయంతాండవం చేస్తోంది.కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.
ఇప్పటికే కేసులు అన్ని జిల్లాల్లో పెరిగిపోతున్న పరిస్థితి ఉంది.అయితే అదే విధంగా కేసులతో పాటు మరణాలు కూడా పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి.
అయితే పెరుగుతున్న కేసులు, మరణాల దృష్ట్యా తెలంగాణలో కేసీఆర్ లాక్ డౌన్ విధిస్తారేమోనని అందరూ భావించారు.కాని రెండు సార్లు జరిపిన సమీక్షలో లాక్ డౌన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
మొదటి నుండీ అమలు చేస్తున్న నైట్ కర్ఫ్యూ ను యధావిధిగా అమలు చేస్తున్నారు.మొదట్లో ఆక్సిజన్ కొరత ఉందని అందుకే కరోనా మరణాలు సంభవించాయని భావించిన కేసీఆర్ ఆక్సిజన్ కొరతను నివారించేందుకు కృషి చేశారు.
మరల హోం ఐసోలేషన్ లో ఉన్న వారు చివరి సమయంలో ఆక్సిజన్ అందక ఆసుపత్రులలో చేరేందుకు వస్తున్నారని అందుకే మరణాలు పెరుగుతున్నాయని భావించిన కేసీఆర్ ఒక ఆక్సిజన్ ఇబ్బంది వచ్చే వరకు పరిస్థితి విషమించకుండా హైజిన్ మెడికల్ కిట్ ను అందిస్తున్నారు.లాక్ డౌన్ విధించకపోవడానికి ముఖ్య కారణం సరిహద్దు రాష్ట్రాలు అయిన మహారాష్ట్ర లో పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించడం, ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కర్ఫ్యూ విధించడం పెద్దగా రాకపోకలు జరగవని భావించిన కేసీఆర్ లాక్ డౌన్ విధించడానికి ఇష్టపడలేదు.