చద్దన్నం, గంజికూడు అనే మాటలు మన గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి.ఇప్పుడంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ టిఫిన్స్ వచ్చేసాయి.
అయితే ఒకప్పుడు పల్లెల్లో ఉదయం బ్రేక్ ఫాస్ట్ అంటే చద్దన్నమే.రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని గంజిలో వేసుకొని దానిని ఉదయాన్నే తినేసి పొలం పనులకి రైతులు వెళ్ళిపోయేవారు.
ఇప్పటికి పల్లెల్లో చాల మంది రైతులు చద్దన్నమే ఎక్కువగా తింటారు.అయితే సిటీలలో మాత్రం చద్దన్నం అనే మాటని పూర్తిగా మరిచిపోయారు.
న్యూట్రీషన్స్ కూడా చద్ధికూడా ఆరోగ్యపరంగా చాలా మంచిది అని చెబుతారు.అలాగే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి, యాక్టివ్ గా ఉండటానికి ఈ చద్దన్నం తినడం వలన ఎంతో ఉపయోగం ఉంటుందని చెబుతారు.
అయినా కూడా దీనిని తినడానికి పెద్దగా ఎవరూ ఇష్టపడరు.అయితే బాలీవుడ్ అందాల భామ మొదటి సారి ఈ చద్దన్నం గురించి ఆసక్తికరమైన విషయం చెప్పింది.
మీడియాలో తరుచుగా మీరు ఇంత అందంగా ఉండటానికి కారణం ఏంటి అనే ప్రశ్నలు హీరోయిన్స్ కి ఎదురవుతూ ఉంటాయి.ఇలా సోషల్ మీడియాలో హీరోయిన్ యామీ గౌతమ్ కి ఒక ప్రశ్న ఎదురైంది.
దానికి తన అందానికి సీక్రెట్ ఉదయాన్నే గంజి తాగడమే అనే విషయం చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.అంతేకాకుండా రోజు విడిచి రోజు చద్ది అన్నం తినడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని ఈ బ్యూటీ టిప్స్ కూడా ఇస్తుంది.
మొత్తానికి ఈ బాలీవుడ్ బ్యూటీ కారణంగా చద్దన్నం, గంజి తింటే అందాన్ని కూడా పెంచుకోవచ్చనే కొత్త విషయం చాలా మందికి తెలిసింది.మరి ఈమె మాటలు ఎంత మంది ఫాలో అవుతారో చూడాలి.