జగన్ ఏదైనా చేయాలనుకుంటే చాలు దాన్ని అమలు చేసి తీరే వరకు అస్సలు ఊరుకోరు. అదేవిధంగా టిడిపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన అమరావతి వ్యవహారంలో మొదటి నుంచి వైసిపి వ్యతిరేకతతో ఉంటూ వచ్చింది.కేవలం టిడిపి , ఓ సామాజిక వర్గం నేతలకు మేలు చేసేందుకే అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకుందని , వైసీపీ మొదటి నుంచి భయపడుతూనే వచ్చింది.2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో మూడు రాజధానుల ప్రతిపాదనను జగన్ తీసుకువచ్చారు.విశాఖ, కర్నూలు, అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తామంటూ సంచలన ప్రకటన చేశారు.దానికి తగ్గట్టుగానే నిర్ణయాలను అమలు చేద్దాం అనుకునే సమయానికి అకస్మాత్తుగా ఈ వ్యవహారంపై టిడిపి, ఆ పార్టీ వర్గీయులు కోర్టుకు వెళ్లడం తో జగన్ నిర్ణయం వాయిదా పడింది.
అయినా విశాఖ లో రాజధానిని ఏర్పాటు చేసేందుకు జగన్ తెర వెనుక ప్రయత్నాలు వచ్చారు.వైసీపీ మంత్రులు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వంటి వారు పదేపదే విశాఖ లో రాజధాని ఏర్పాటు చేస్తున్నాము అంటూ ప్రకటనలు చేశారు.
అయితే కోర్టు వ్యవహారం కారణంగా అధికారికంగా రాజధానిని ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం ఉంది.
కోర్టులో వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు .గతంలో హైకోర్టు రాజధాని తరలింపు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ ప్రారంభించింది. రైతులు , టిడిపి నాయకులతో పాటు మరికొంత మంది ఈ పిటిషన్ వేశారు .అప్పటి ప్రధాన న్యాయమూర్తి మహేశ్వరి నాయకత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని అమరావతి రైతులు భావించగా చీఫ్ జస్టిస్ కు ఏపీ సీఎం జగన్ లేఖ రాయడం, ఆ తర్వాత పరిణామాలలో జెకె మహేశ్వరి బదిలీ అవడం, జస్టిస్ రాకేష్ కుమార్ పదవీ విరమణ చేయడం , అరబ్ గో స్వామి ప్రధాన న్యాయమూర్తిగా రావడం వంటివి వాటితో జాప్యం జరిగింది.
అమరావతి పిటిషన్ వేసే సమయంలో న్యాయమూర్తులు చాలావరకు మారిపోవడంతో, రాజధాని కేసు పునర్విచారణ చేపడతామని జస్టిస్ గోస్వామి ప్రకటించారు.దీంతో మళ్లీ రాజధానికి సంబంధించిన సాక్షాలు, వాదనలు మళ్ళీ కొత్తగా వినిపించాల్సిన ఉంటుంది. ఇక వేసవి సెలవులు, కరోోనా, లా ఎన్నో అంశాలు కారణంగా మూడు రాజధానులు వ్యవహారం మరి కొంతకాలం పాటు జాప్యంం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో పైచేయి సాధించాలని జగన్ చూస్తున్న , రకరకాల కారణాలతో అది కాస్త వాయిదా పడుతూ మరింత జాప్యం అవుతోంది.