వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తరపు న్యాయవాదులు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ వేయడం తెలిసిందే.ఈ పిటిషన్ నేడు విచారణకు రానుంది.
ఎస్.ఎల్.పి తో పాటు, ఆయన కుమారుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్ పై కూడా విచారణ జరగనుంది.ఇంతకుముందు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు సింగిల్ జడ్జి డిస్మిస్ చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ ని దాఖలు చేశారు రఘురామకృష్ణం రాజు తరపు న్యాయవాదులు.
ఇదే తరుణంలో మరో పక్క భరత్ Cid కోర్టు జారీ చేసిన రిమాండ్ ఆర్డర్ తో పాటు హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తాత్కాలిక ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్లపై నేడు జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బి.ఆర్.గవై లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేయనుంది.పిటిషనర్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు.ఇదిలా ఉండగా రఘురామకృష్ణంరాజు ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో ఉండటంతో ఆయనపై హత్యాయత్నం జరిగే అవకాశం ఉందని ఆయన భార్య రమాదేవి తో పాటు విపక్ష నేత చంద్రబాబు కూడా ఇదే రీతిలో వ్యాఖ్యలు చేశారు.
అంత మాత్రమే కాక రఘురామకృష్ణంరాజు అరెస్టు పట్ల గవర్నర్ కి కూడా చంద్రబాబు లెటర్ రాయడం జరిగింది.పరిస్థితి ఇలా ఉండగా సుప్రీంకోర్టు రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్ విషయంలో ఎటువంటి తీర్పు ఇస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.