పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన టెంపర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు నిర్మాత బండ్ల గణేష్ కు భారీ లాభాలను అందించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో ఇట్టాగే రెచ్చిపోదాం అనే సాంగ్ కు డ్యాన్స్ చేసి నోరా ఫతేహి తెలుగులో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.
అయితే తాజాగా ఒక సందర్భంలో మాట్లాడిన నోరా ఫతేహి తను పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చారు.
తన కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో 16వ సంవత్సరంలోనే తాను పని చేయాల్సి వచ్చిందని నోరా ఫతేహి పేర్కొన్నారు.
తన కుటుంబ సభ్యులు పడుతున్న కష్టాలను చూసి మాల్ లో తాను సేల్స్ అసోసియేట్ గా పని చేశానని ఆమె తెలిపారు.ఆ తరువాత కాలంలో బార్లు, రెస్టారెంట్లలో తాను వెయిటర్ గా పని చేశానని చెప్పుకొచ్చారు.
వస్త్రాలను అమ్మే దుకాణంలో పని చేయడంతో పాటు లాటరీ టికెట్లు కూడా అమ్మానని ఆమె చెప్పుకొచ్చారు.
అభిమానులకు ఎవరికీ తెలియని తన జీవితానికి సంబంధించిన విశేషాలను నోరా ఫతేహి వెల్లడించారు.
నోరా ఫతేహి పడిన కష్టాల గురించి తెలిసి అభిమానులు అవాక్కవుతున్నారు.ప్రస్తుతం నోరా ఫతేహి భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.కెనడాలో పుట్టిన నోరా ఫతేహి బాలీవుడ్ సినిమాల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్నారు.
సోషల్ మీడియాలో నోరా ఫతేహికి కోట్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.నోరా నటి మాత్రమే కాక డ్యాన్సర్, సింగర్, నిర్మాత కూడా కావడం గమనార్హం.2014 సంవత్సరం నుంచి సినిమాల్లో యాక్టివ్ గా ఉంటున్న నోరా ఫతేహికి అవకాశాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.