దగ్గు.ఒక్క సారి పట్టుకుందంటే ఓ పట్టాన వదిలి పెట్టదు.
ఆహారపు అలవాట్లు, వాతావరణంలో మార్పులు, ఏవైనా అనారోగ్య సమస్యలు, కఫం, స్మోకింగ్, ఇన్‌ఫెక్షన్, అలర్జీ ఇలా రకరకాల కారణాల వల్ల దగ్గు ఇబ్బంది పెడుతుంది.అయితే కొందరు ఎడతెరిపే లేకుండా దగ్గుతూ నానా తిప్పలు పడుతుంటారు.
ఇలాంటి తీవ్రమైన దగ్గును తగ్గించుకోవడం చాలా కష్టం.కానీ, కొన్ని కొన్ని న్యాచురల్ టిప్స్ పాటిస్తే.
సులుభంగా దగ్గుకు గుడ్ బై చెప్పొచ్చు.మరి ఆ టిప్స్ ఏంటో చూసేయండి.
![Telugu Basil, Cabbage, Cough, Tips, Natural-Telugu Health - తెలుగు Telugu Basil, Cabbage, Cough, Tips, Natural-Telugu Health - తెలుగు](https://telugustop.com/wp-content/uploads/2021/06/natural-remedies-cough-cabbage-benefits-of-cabbage-cabbage-for-health-health-tips-g.jpg )
తీవ్రమైన దగ్గును తగ్గించడంలో క్యాబేజీ గ్రేట్‌గా సహాయపడుతుంది.క్యాబేజీలో ఉండే కొన్ని ముఖ్యమైన పోషకాలు.దగ్గుకు ఒక మందులా పని చేస్తాయి.అవును, ఫ్రెష్‌గా ఉండే క్యాబేజీ ఆకులను మెత్తగా నూరి రసం తీసుకుని తాగాలి.లేదంటే క్యాబేజీ ఆకులను శుభ్రం చేసి డైరెక్ట్‌గా నమిలి మింగేయాలి.ఇలా ఎలా చేసినా దగ్గు చాలా త్వరగా తగ్గు ముఖం పడుతుంది.
అలాగే బాదంతో కూడా దగ్గును నివారించుకోవచ్చు.తొక్కతో ఉన్న ఐదు బాదం పప్పులకు చిన్న పటిక బెల్లం ముక్క మరియు నాలుగు మిరియాలు చేర్చి ఉదయాన్నే ఖాళీ కడుపుతో నమిలి తినేసి.
అనంతరం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీరు తాగాలి.ఇలా చేసినా కూడా మొండి దగ్గు మటు మయం అవుతుంది.
![Telugu Basil, Cabbage, Cough, Tips, Natural-Telugu Health - తెలుగు Telugu Basil, Cabbage, Cough, Tips, Natural-Telugu Health - తెలుగు](https://telugustop.com/wp-content/uploads/2021/06/natural-remedies-cough-cabbage-benefits-of-cabbage-cabbage-for-health-health-t.jpg )
ఇక తీవ్రమైన దగ్గును సూపర్ ఫాస్ట్‌గా తగ్గించడంలో తులసి ఆకులూ ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి.ఫ్రెష్‌గా ఉండే గుప్పెడు తులసి ఆకులను తీసుకుని ఒక గ్లాస్ వాటర్‌లో ఏసి మరిగించుకోవాలి.ఆ తర్వాత నీటిని వడబోసి.అందులో కొద్దిగా తేనె కలిపి తీసుకోవాలి.ఇలా చేసినా దగ్గు క్రమంగా తగ్గి పోతుంది.మరియు ఈ తులసి వాటర్ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.