పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా వచ్చిన సినిమా వకీల్ సాబ్.ఈ సినిమా విడుదల అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.
ఆడవాళ్లకు జరిగే అన్యాయాలను కళ్ళకు కట్టినట్టు చూపించారని పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.అయితే మొదటి సారి పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు సినిమా చేసాడు.
పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలన్న తన డ్రీమ్ ను ఇన్ని రోజులకు నెరవేర్చుకున్నాడు.
అయితే ఈ సినిమా తర్వాత దిల్ రాజు పవన్ కళ్యాణ్ తో మరొక సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.
అంతేకాదు పవన్ సైడ్ నుండి గ్రీన్ సిగ్నల్ కూడా తెచుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.మంచి కథ రెడీ అయ్యాక పవన్ ను మళ్ళీ కలుస్తానని దిల్ రాజు పవన్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి.
అంచి డైరెక్టర్ కోసం వెతుకుతున్న దిల్ రాజుకు డైరెక్టర్ దొరికేసాడట.
ఈ సినిమా బాధ్యతలు దిల్ రాజు వంశీ పైడిపల్లికి అప్పజెప్పినట్టు సమాచారం.వంశీ పైడిపల్లి ఇప్పటికే దిల్ రాజు బ్యానర్ లో చాలా సినిమాలు చేసాడు.వంశీ పైడిపల్లి మున్నా, బృందావనం, ఎవడు, మహర్షి వంటి సూపర్ హిట్ సినిమాలను దిల్ రాజుతో చేసాడు.
అందుకే ఇప్పుడు కూడా దిల్ రాజు పవన్ కళ్యాణ్ సినిమాను వంశీ పైడిపల్లికే అప్పజెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే ఈ విషయంపై దిల్ రాజు, వంశీ పైడిపల్లి పవన్ కలిసి చర్చించారని టాక్.
వంశీ పైడిపల్లి మహర్షి సినిమా సూపర్ హిట్ అయినా తర్వాత కూడా ఇప్పటి వరకు మరొక సినిమాను మొదలు పెట్టలేదు.మళ్ళీ దిల్ రాజు బ్యానర్ లోనే సినిమా చేయబోతున్నాడని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.
అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నే డైరెక్ట్ చేసే అద్భుత అవకాశాన్ని పొందాడు.ఈ సినిమాపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.