జనసేనాని ప్రజల్లోకి రాక ముందు వరకూ ఆయన ఏది మాట్లాడినా.అది మీడియాలో ఎంతో హైలైట్ అయ్యేది.
ఆయన ప్రెస్ మీట్ పెట్టినా, బహిరంగ సభ పెట్టినా, ఎక్కడికైనా వెళ్లినా.కెమెరాలన్నీ ఆవైపే ఉండేవి.
ఏ చానల్ చూసినా పవన్ మాత్రమే కనిపించేవాడు.చానల్స్ అన్నీ హడావుడి చేస్తూ కవరేజ్ ఇచ్చేవి.
కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తేలిపో యింది.పవన్ శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన పోరాట యాత్రకు మీడియా కవరేజ్ చూస్తే ఈ విషయం ఇట్టే పసి గట్టేయచ్చు! ఏదో పవన్‌ను కూడా చూపించాలి కాబట్టి.
మరి ఇంతోనే ఎంత మార్పు ఎలా సాధ్యమైంది? మీడియా ప్రాధాన్యం ఎందుకు ఇలా మారిపోయింది? జనసేనాని ఎక్కువగా మీడియాలో కనిపిస్తే టీఆర్‌పీ రేటింగులు పెరుగు తాయని తెలిసినా ఎందుకు మీడియా పక్కన పెట్టేసింది? అనే ప్రశ్నలు సహజమే.అయితే దీనికి ఒకే ఒక్క కారణం టీడీపీతో దోస్తీ కటీఫ్ అయిపోవడమేనట.మరి ఈ రెండింటికీ లింకేంటి అంటే

తెలుగు మీడియాలో ఎవరిని హైలైట్ చేయాలి? ఎవరిని చేయకూడదు? ఎవరి వ్యాఖ్యలను పదేపదే చూపిస్తూ.వాళ్లని డీఫేమ్ చేయాలి? ఏ నేత చేసిన వ్యాఖ్యలు ఆరోజంతా వినిపించాలి? ఏ నేత ఆ రోజంతా తమ చానల్‌లో కనిపించాలి? అనే అంశాలన్నీ కొంతమంది ముందుగానే డిసైడ్ చేస్తారనే విషయం తెలిసిందే! మీడియాను అత్యంత చాకచక్యంగా ఉపయోగించుకునే పెద్దలు.ప్రత్యేకంగా తయారుచేసి రాసిచ్చిన గైడ్ లైన్స్‌నే మీడియా అధినేతలు తూచ తప్పకుండా ఫాలో అవుతున్నారనేది బహిరంగ సత్యం.ఇప్పుడు పవన్ విషయంలోనూ ఇదే జరుగుతోందనే చర్చ జరుగుతోంది.
పవన్‌ను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు మీడియా సహాయ నిరాకరణ వెనుక పెద్ద కథే ఉందంటున్నారు విశ్లేషకులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనం ముందుకు వెళ్తున్నా.పార్టీని ప్రజల్లోకి తీసుకువెళుతున్నా.
ఆయనకు రావాల్సిన హైప్ రావడం లేదనే విషయంపై విశ్లేషకులు ఆరా తీస్తున్నారు.సాధారణంగా పవన్ అంటేనే ఒక ప్రభంజనం.
పవన్ ప్రజల్లోకి వెళుతున్నాడంటే ఇక ఆ అభిమానాన్ని ఆపడం కష్టసాధ్యమే! కానీ జరగాల్సినంత హంగామా జరగడం లేదు.మీడియాలోనూ ఎటువంటి హడావుడి కనిపించడమే లేదు.
పవన్ కల్యాణ్ ఒక పేరున్న సినీ హీరో.అందులోనూ స్టార్ హీరో.
చోటామోటా హీరోలు జనం ముందుకు వెళ్తేనే బ్రహ్మాండంగా జనం వస్తారు.కానీ పవన్ పర్యటనల్లో అంత సీన్ కనిపించడం లేదు.
కొన్నాళ్ల కిందట వరకూ పవన్ జనం ముందుకు వస్తే మీడియా ఇక వేరే వార్తలే లేదన్నట్టుగా చూపేది.అప్పట్లో పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేవాడు.
చంద్రబాబుకు సానుకూలంగా మాట్లాడేవాడు.కాబట్టి ఈ పాయింట్ల ఆధారంగా మీడియా వర్గాలు పవన్ పర్యటనలకు బ్రహ్మాండమైన కవరేజీ ఇచ్చాయి.పవన్ జనం ముందుకు వస్తే అంతకు మించి వేరే విషయం లేనట్టుగా వ్యవహరించాయి.ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పవన్ కు చెడింది.
చంద్రబాబు, లోకేష్ అవినీతిపై పవన్ ప్రశ్నించడం మొదలుపెట్టాడు.దీంతో మీడియా ప్రాధాన్యం మారిపోయింది.
కవరేజీ తగ్గిపోయింది.ఏదో నామకేవాస్తే పవన్ పర్యటన గురించి వార్తలను చూపడమే కానీ.
అంతకు మించి కథేం లేదు.మీడియా కవరేజీ ముందు స్థాయిలో లేకపోవడంతో పవన్ పర్యటనలపై హైప్ తగ్గింది.
అంతేగాక గతంలో మీడియా అధినేతలపై పవన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం కూడా తెలిసిందే!
.