చంద్రబాబు నాయుడు ప్రకటించిన నిరుద్యోగ ప్రకటన ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.యువత అందరూ చంద్రబాబుకి జై కొడుతున్నారు.
ఎన్నికల హామీ అమలు చేసినందుకు గాను ఏపీ యువత మొత్తం చంద్రబాబు కి కృతజ్ఞతలు తెలిపుతున్నారు అంటూ టీడీపి నేతలు తెగ డప్పులు కొట్టుకుంటున్నారని వైసీపి వాళ్ళు కౌంటర్ వేస్తున్నారు అసలు హామీ ఇచ్చింది చివరిలో యువత ఓట్ల కి గేలం వేయడం కోసమా అయితే ఎన్నికల మొదటి సంవత్సరం నుంచీ ఆ మొత్తాన్ని అమలు చేసే దమ్ము ఉందా అంటూ వైసీపి వాళ్ళు టీడీపీ కి సవాల్ విసురుతున్నారు.అసలు వివరాలలోకి వెళ్తే
ఏపీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తాను నిరుద్యోగులకి ఇచ్చిన హామీని ఎట్టకేలకి ఇస్తున్నట్టుగా ప్రకటన చేశారు.
రాష్ట్రంలో యువత మొత్తం ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఏమి చేయలేక పోయింది అనుకున్న సమయంలో యువత అంతా తీవ్రమైన అసంతృప్తిగా ఉన్న తరుణంలో చంద్రబాబు వేసిన ఈ స్కెచ్ యువత ని తనవైపు తిప్పుకోవడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు.అయితే చంద్రబాబు ప్రకటించిన ఈ బృతి పొందటానికి కనీస విద్యార్హత డిగ్రీ గా నిర్ధారించారు…దాదాపు ఈ సాయం 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు
ఆర్ధిక మంత్రి యనమల ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి ఈ భాద్యతలు అప్పగించారు.అయితే ఈ బృతి కోసం ఏటా రూ.1200 కోట్లు ఖర్చవుతుందన్నారు అయితే ఈ విషయంపై ఏకంగా 12 దేశాల్లో అధ్యయనం చేశామని అన్నారు…అయితే ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది అయితే ఈ మొత్తం ఎపీసోడ్ లో అసలు ట్విస్ట్ ఏమిటంటే…ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వానికి పట్టిన 4 ఏళ్ల సమయం చాలలేదట ఇంకా కొంత సమయం కావాలట కొన్ని విధివిధానాలు రూపొందించిన తరువాత ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్న దాన్నిబట్టి మార్పులు చేర్పులు చేసి అప్పుడు మరోసారి క్యాబినెట్ మీటింగ్ లో పెట్టి అప్పుడు అమలు చేసే తేదీని ప్రకటిస్తారట.
ఈ లెక్కలో ఈ తంతు అంతా జరగడానికి దాదాపు ఆరు నుంచీ ఏడు నేలల సమయం పడుతుంది ఈలోగా ఎన్నికలు రానే వస్తాయి దాంతో చివరి నాలుగు నెలలో లేదా రెండు నెలలో నిరుద్యోగులకి బృతి ఇచ్చి మేము ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం అని చెప్పి ఒట్లకి గేలం వేస్తారని అంటున్నారు వైసీపి నేతలు.అయితే ఇలాంటి జిమ్మిక్కులు చేయడం కేవలం చంద్రబాబు కే సాధ్యం అయ్యే పని.మాకు ఇలాంటి డ్రామాలు ఆడటం తెలియదు కేవలం యువత ఓట్ల కోసం చంద్రబాబు ఇప్పుడు అనూహ్యంగా నిరుద్యోగ బృతిని తెరపైకి తీసుకు వచ్చారు అంటూ మండిపడుతున్నారు.