తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ కే ఎక్కువ నాయకులు ఉన్నారు.బీజేపీకి చాలా నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు నాయకులు కూడా లేరు.
కానీ కాంగ్రెస్‌కు మాత్రం అన్ని నియోజకవర్గాల్లో నాయకులు ఉన్నారు.అయితే కాల క్రమేణా చాలామంది కాంగ్రెస్‌ను వీడిన మాట వాస్తవమే.
ఇప్పుడు రేవంత్ పగ్గాలు చేపట్టిన తర్వాత సీన్ రివర్స్ అవుతోంది.కాంగ్రెస్‌లో మళ్లీ పాత రోజులు కనిపిస్తున్నాయి.
మొన్న వరి విషయంలో చేపట్టిన ధర్నాకు అసంతృప్తులు కూడా ఒకేవేదిక ఎక్కడంతో రేవంత్‌కు మరింత బలం పెరిగింది.
దీంతో ఒక్క సారిగా రేవంత్ ఇమేజ్ పెరిగిపోయింది.
మొన్నటి వరకు కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు వెనకడుగు వేసిన మిర్యాలగూడ, కొల్లాపూర్, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు చాలామంది ముందుకు వస్తున్నారు.ఇదే అవకాశాన్ని రేవంత్ వినియోగించుకుంటున్నారు.
గతంలో కాంగ్రెస్‌ను వీడిని వారిని, అలాగే తనకు టీడీపీలో పరిచయస్తులను అందరినీ కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ విషయాన్ని కేసీఆర్ కూడా పసిగట్టారు.
అందుకే తమకు ప్రత్యర్థి అంటే బీజేపీ అన్నట్టు ఆ పార్టీనే టార్గెట్ చేస్తున్నారు.
తెలంగాణలో ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది.
అలాగే బీజేపీకి గ్రౌండ్ లెవల్ లో కాంగ్రెస్ కు ఉన్నంత కేడర్ లేదు.కాబట్టి మళ్లీ కాంగ్రెస్ బలపడకుండా ఉండాలంటే బీజేపీని టార్గెట్ చేయాలని కేసీఆర్ డిసైడ్ అయిపోయారు.
కానీ రేవంత్ మాత్రం కేసీఆర్‌కు చెక్ పెట్టే విధంగా టీఆర్ ఎస్‌లో ఆప్షన్ కోసం వెయిట్ చేస్తున్న వారిని తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు.టీఆర్ఎస్ ను గట్టిగా విమర్శించే నాయకులను మీడియా డిబేట్లకు పంపిస్తున్నారు.
అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చి బలమైన నేతలను తయారు చేసుకోవాలని ప్లాన్ వేస్తున్నారంట.మరి రేవంత్ ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.