నేడు దేశంలో జరుగుతున్న ఆన్‌లైన్ మోసాల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.ఎందుకంటే ఈ మోసాల నెట్‌వర్క్ ఎంత స్పీడ్‌లో ఉందో రోజు రోజుకు దేశంలో జరుగుతున్న మోసాలను చూస్తే తెలుస్తుంది.
ఇక ఈ ఆన్‌లైన్ మోసాల బారిన ప్రైవేట్ సంస్దలతో పాటుగా, ప్రభుత్వ రంగ సంస్దలు కూడా పడుతుండటంతో ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
ఈ నేపధ్యంలోనే దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ అయినా ఎస్‌బీఐ కూడా తమ ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేస్తుంది.
ఈ క్రమంలో బ్యాంకు ఖాతాలకు సంబంధించిన రహస్య సమాచారం ఏదైనా సెల్‌ఫోన్లలో దాచుకుంటే వెంటనే దానిని డిలీట్ చేయాలని ఖాతాదారులకు సూచించింది.
ముఖ్యంగా పిన్, డెబిట్, క్రెడిట్ కార్డు, పాస్‌వర్డ్‌లు, సీవీవీ నంబర్ తో సహా కీలక సమాచారం ఏదీ కూడా ఫోన్‌లో ఉండకుండా చూసుకోవాలని, అవి కనుక ఫోన్‌లో ఉంటే మోసాల బారినపడడం ఖాయమని తెలియచేస్తుంది.
కావున ఇలాంటి సమాచారాలు మీ సెల్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేయాలని స్టేట్‌బ్యాంక్ సూచిస్తుంది.