పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు పవన్.
దాదాపు మూడు సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద కనిపించడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందంతో తేలిపోతున్నారు.ఇప్పటికే కలెక్షన్ల పరంగా కూడా కుమ్మేస్తుంది.
అయితే ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ కు ఎంత పేరు వచ్చిందో డైరెక్టర్ వేణు శ్రీరామ్ కు కూడా అంతే పేరు వచ్చింది.
ఈ సినిమా హిట్ అవ్వడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ చూపు మొత్తం వేణు శ్రీరామ్ పై పడింది.
ఈ సినిమా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన మన నేటివిటీకి తగ్గట్టుగా వేణు శ్రీరామ్ కథలో మార్పులు చేసి కొన్ని తెరకెక్కించాడు.దీంతో ఈయన ప్రతిభ నిరూపించుకున్నాడు.
అయితే ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ నెక్స్ట్ చేయబోయే సినిమా పై ఆసక్తి కలుగుతుంది.
వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ సినిమా కంటే ముందు అల్లు అర్జున్ తో ‘ఐకాన్ కనబడుటలేదు’ అనే సినిమాను ప్రకటించాడు.
అయితే పవన్ కళ్యాణ్ తో ఆఫర్ రావడంతో వేణు శ్రీరామ్ ఆ సినిమాను పక్కన పెట్టేసాడు.తన ఫోకస్ మొత్తం వకీల్ సాబ్ సినిమాపైనే పెట్టాడు.
అయితే ఈ సినిమా పూర్తి అయ్యి విడుదల కూడా అయ్యి బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఇప్పుడు మళ్ళీ ఐకాన్ సినిమా వార్తల్లోకి వచ్చింది.
![Telugu Allu Arjun, Dil Raju, Dilraju, Venu Sriram, Icon, Koratala Siva, Vakeel S Telugu Allu Arjun, Dil Raju, Dilraju, Venu Sriram, Icon, Koratala Siva, Vakeel S](https://telugustop.com/wp-content/uploads/2021/04/dil-raju-next-movie-is-icon-with-the-allu-arjun.jpg )
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా అల్లు అర్జున్ హీరోగా ఐకాన్ సినిమాను రెండు సంవత్సరాల క్రితమే ప్రకటించాడు.అయితే ఇప్పుడు దిల్ రాజు మళ్ళీ ఈ సినిమాను సెట్స్ మీదకు తేవడానికి రెడీ అయ్యాడు.ఈ విషయన్ని అధికారికంగా దిల్ రాజు ప్రకటించారు.
ఇప్పుడు మేము చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే.పూర్తి స్క్రిప్ట్ కూడా రెడీగా ఉంది త్వరలోనే దీనిని స్టార్ట్ చేస్తాం అని దిల్ రాజు మీడియాతో తెలిపాడు.
అయితే ఈ సినిమా అధికారికంగా ప్రకటించడంతో ఇప్పుడు అల్లు అర్జున్ చేయబోయే తర్వాత సినిమా ఇదే అని అందరు భావిస్తున్నారు.అల్లు అర్జున్ నెక్స్ట్ చేయబోయేది కొరటాల శివతో అయినా ఆయన ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడు కాబట్టి అల్లు అర్జున్ నెక్స్ట్ చేయబోయేది ‘ఐకాన్’ సినిమానే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.