ఒకప్పుడు తెలంగాణలో ఏ మాత్రం పట్టులేని బీజేపీ రెండు సంవత్సరాల క్రితం నుండి ఒక్కసారిగా దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపొంది, అంతేకాక గ్రేటర్ లో రెండు సీట్ల నుంచి నలభైకి పైగా సీట్లలో గెలుపొంది అధికార టీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పవచ్చు.అయితే ఆ తరువాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ అభ్యర్థులు కనీసం సత్తా చాటలేకపోయారు.
ఇక బీజేపీ పని అయిపోందని కొంత మంది బీజేపీ వ్యతిరేక ప్రచారాన్ని మొదలు పెట్టారు.త్వరలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరగనున్న విషయం తేలిసిందే.
అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీకి క్యాడర్ లేకపోవడంతో బీజేపీ ఈ ఎన్నికలో అభ్యర్థిని నిలబెట్టినా సరే గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయనే భావన వ్యక్తమవుతోంది.అయితే షర్మిల హడావిడి జరుగుతున్న పరిస్థితులలో బండి సంజయ్ మౌనం వహిస్తున్నారు.
ఎందుకంటే బీజేపీ ఇప్పుడిప్పుడే క్యాడర్ ను నిర్మాణం చేసుకుంటోంది.ఈ సమయంలో వేచిచూసే ధోరణిని వ్యవహారిస్తున్నారు.
తద్వారా ఎవరి అడుగులు ఎటువైపు అనే విషయం క్షుణ్ణంగా తెలిసే అవకాశం ఉన్న పరిస్థితులలో మౌనం వహించడం మేలని బీజేపీ భావిస్తున్నట్టు ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.మరి బీజేపీ ఈ వ్యూహం ద్వారా రాజకీయంగా ఎటువంటి లబ్ధిపొందుతుందో చూడాల్సి ఉంది.