టాలీవుడ్ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు సంపాదించుకున్న హీరోల్లో గోపీచంద్ ఒకరు.ఈయన తొలివలపు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు.తర్వాత కొన్ని విలన్ పాత్రలు కూడా చేసాడు.ప్రస్తుతం ఈయన సీటిమార్ అనే సినిమా చేస్తున్నాడు.వరుస ప్లాపులతో సతమతమవుతున్న గోపీచంద్ కు ఈ సినిమా కీలకంగా మారింది.సంపత్ నంది దర్శకత్వంలో తమన్నా, దిగంగన సూర్య వంశి హీరోయిన్స్ గా ఈ సినిమా రూపొందుతుంది.
ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి మారుతీ డైరెక్షన్ లో మరొక సినిమా చేస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపు కుంటుంది.ఈ సినిమా టైటిల్ ను “పక్కా కమర్షియల్” అని అధికారికంగా ప్రకటించారు.పక్కా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.
గీత ఆర్ట్స్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
డైరెక్టర్ మారుతీ ప్రతిరోజు పండగే సినిమాతో సక్సెస్ అందుకుని జోరు మీద ఉన్నాడు.
ఈ సినిమాలో రాశి ఖన్నాను టిక్ టాక్ స్టార్ గా చూపించి నవ్వించాడు.ఇప్పుడు కూడా మారుతీ రాశి ఖన్నాను కామెడీ పాత్రలోనే చూపించ బోతున్నట్టు సమాచారం.
అందుకోసం ఒక ప్రత్యేక మైన పాత్రను కూడా క్రియేట్ చేసాడట మారుతీ.ఈ సినిమాలో రాశి ఖన్నా సీరియల్ స్టార్ గా నవ్వించబోతున్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం సీరియల్స్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ఈ పాత్ర ద్వారా సీరియల్స్ ను సెటైరికల్ గా చూపించి కామెడీ పండించబోతున్నాడట మారుతీ.ఇప్పటికే విడుదలైన పక్క కమర్షియల్ సినిమా ఫస్ట్ లుక్ లో రాశి ఖన్నాను లాయర్ గెటప్ లో చూపించాడు.
అయితే నిజంగానే లాయర్ గా నటిస్తుందా లేదంటే సీరియల్ గెటప్ లో భాగమా అనేది తెలియాలంటే సినిమా వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.