సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ వాళ్ల వాళ్ల ప్రతిభను చూపిస్తూ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు.అలాంటి హీరోయిన్స్ లో కొందరు టాప్ రేంజ్ కి వెళ్లి పోతే మరికొందరు మధ్యలోనే అవకాశాల్లేక ఆగిపోవాల్సి వస్తుంది కొందరు టాప్ హీరోయిన్ గా చలామణి అవుతున్న సమయంలో అనుకోని సంఘటనల వల్ల ఇండస్ట్రీని వదిలి వెళ్లి పోవాల్సి వస్తుంది అలా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ వాళ్ల క్రేజ్ పిక్స్ లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి సినిమాల నుంచి తప్పుకున్న హీరోయిన్స్ లో అను అగర్వాల్ ఒకరు.
అను ఆమె 1969లో ఢిల్లీ లో జన్మించారు.అటు తర్వాత వాళ్ళ ఫ్యామిలీ చెన్నైకి షిఫ్ట్ అయింది ఆమెకు యుక్త వయసు వచ్చిన తర్వాత చదువు నిమిత్తం మళ్లీ ఢిల్లీకి చేరుకుంది.
ఢిల్లీలో చదువు ముగించిన తర్వాత స్వతహాగా అందంగా ఉండే అను అగర్వాల్ వాళ్ళ ఫ్రెండ్స్ తన అందాన్ని గుర్తించి నువ్వు మోడలింగ్ వైపు వెళ్తే బెటర్ అని చెప్పడంతో తను మోడలింగ్ చేసేది 1988లో దూరదర్శన్ లో రేడియో జాకీగా కూడా తను పని చేసింది.అయితే సినిమాల్లోకి రావడం ఇష్టం లేని అను అగర్వాల్ నీ కూడా ఒప్పించి బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు అయిన మహేష్ బట్ తనతో ఆషికి అనే సినిమాని తీశాడు.
ఆ సినిమా అప్పుడు చాలా పెద్ద విజయం సాధించింది ముఖ్యంగా ఆ సినిమాలో నటించిన అను అగర్వాల్ తన అందంతో అప్పుడున్న యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ముఖ్యంగా తన కళ్ళతో మ్యాజిక్ చేసిందని చెప్పాలి.
ఆ తర్వాత వరుసగా తనకు సినిమా అవకాశాలు రావడం స్టార్ట్ అయ్యాయి వద్దన్నా కూడా ప్రొడ్యూసర్స్ వినకుండా ఒక సినిమా చేయమని బలవంతం చేసే వారు దాంతో సినిమాల్లో చాలా సెలెక్టివ్ గా ఉందాం అనుకొని తను ఫారిన్ ట్రిప్ వెళ్లి వచ్చిన తర్వాత సినిమాల ని సెలెక్ట్ చేసుకున్నానని సినిమా అయిపోయిన తర్వాత ఫారిన్ వెళ్ళేది.
ఫారిన్ నుంచి తను వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్లు ఆమె ఎన్ని డబ్బులు అడిగితే అన్ని డబ్బులు ఇచ్చి ఆమెకు ఏ జోనర్ నచ్చితే ఆ జోనర్ లో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు మొత్తానికి అయితే తనతో ఒక సినిమా చేయాలని దర్శకనిర్మాతలు తనని ఫోర్స్ చేస్తూ ఉండేవారు.దాంట్లో భాగంగానే మణిరత్నం తీసిన దొంగ దొంగ సినిమా లో నటించింది ఆ సినిమాలో కొంచెం నీరు కొంచెం నిప్పు అంటూ సాగే సాంగ్ లో తన కళ్ళతో మాయ చేసిందని చెప్పాలి.
అయితే తను తీసిన మొదటి సినిమా అయిన ఆషికి సినిమా ఎంత గొప్ప విజయం సాధించిందంటే 2013లో వచ్చిన ఆశిక్ 2 సినిమా కూడా దాని ఇంపాక్ట్ వల్లే బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.
వరుసగా ఒకే రకమైన క్యారెక్టర్లు చేస్తూ వస్తున్న అను అగర్వాల్ కి సినిమాల మీద బోర్ కొట్టింది దాంతో ఏం చేయాలో అర్థం కాక ఏ క్యారెక్టర్లు చేయాలో తనకు తాను నిర్ణయించు కోలేకపోయింది.అసంతృప్తితో ఉన్న తను ది క్లౌడ్ డోర్ అనే ఇండో జర్మనీ సినిమా లో నటించింది దీని దర్శకుడు అయిన మనీ కౌర్ మన తెలుగు వాడే అవ్వడం విశేషం.అయితే ఈ క్లౌడ్ డోర్ సినిమాలో అనూ అగర్వాల్ పూర్తిగా నగ్నంగా నటించింది.
నగ్నంగా నటించడం అంటే మామూలు విషయం కాదు ఇప్పుడు హీరోయిన్స్ నగ్నంగా నటిస్తున్నారు అంటేనే మనం విచిత్రంగా చూస్తున్నాం కానీ అను అగర్వాల్ 1994లో వచ్చిన ఈ సినిమాలోనే తను నగ్నంగా నటించింది అంటే ఆమెకి ఎంత ధైర్యం ఉండాలి.ఇప్పుడంటే యూట్యూబ్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కానీ అప్పుడు అలాంటివి ఏమీ లేవు అయినా కూడా ఆమె ధైర్యం చేసి నటించిందని చెప్పాలి అప్పుడు జనాలు ఇలాంటి సినిమాలు రహస్యంగా వి సి ఆర్ లో అయితే క్లౌడ్ డోర్ సినిమా చాలా పెద్ద హిట్ అయింది తర్వాత ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి.
సినిమాల్లో చేసిన పాత్రలే మళ్ళీ చేస్తూ ఉండడం వల్ల బోర్ కొట్టి ఆమె కొన్ని రోజులు హిమాలయాలకి గాని ఏదైనా ఆశ్రమానికి గాని వెళ్ళి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని మళ్ళీ వచ్చి సినిమాల్లో నటించాలి అనుకున్నారు.
దీంతో ఆశ్రమానికి బయల్దేరిన ఆవిడ కారుకి యాక్సిడెంట్ అయింది.దాంతో ఆవిడ చనిపోయింది అనుకున్నారు అందరు కానీ ఆవిడ కొన ఊపిరితో బతికినప్పటికీ బాడీలో ఉన్న ప్రతి ఎముక విరిగిపోయింది చాలాచోట్ల సర్జరీ జరగడంతో ఆవిడ ఆల్మోస్ట్ ఒక నెల రోజులు కోమాలోనే ఉండి ఆ తర్వాత బయటకు వచ్చారు వచ్చిన తర్వాత ఆమె గతం గుర్తు లేకుండా మొత్తం మర్చిపోయారు అయితే యాక్సిడెంట్ అయినప్పుడు ముఖానికి గాజు సీసాలు గుచ్చుకోవడం తో ఆమె ఫేస్ ని ఎవరు గుర్తు పట్టలేకుండా అయిపోయింది యోగా ధ్యానం వల్ల తనకి గతం గుర్తుకు వచ్చినప్పటికీ సినిమాల్లో నటించే అవకాశాలు రాలేదు దాంతో ధ్యానం యోగా మీద ఎక్కువ ఫోకస్ చేశారు.అయితే ఇదంతా ఆవిడ రాసిన తన ఆత్మకథలో చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం తనకు సినిమాల్లో నటించాలని కూడా ఉందని ఆత్మ కథలో రాశారు అయితే ఒక యంగ్ దర్శకుడు ఆమెను కలిసి ఆమె స్టోరీ ని బయోపిక్గా తీస్తానని ఆమెకు చెప్పాడంట.చూద్దాం మరి ఆమె బయోపిక్ వస్తుందో లేదో.