పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తన బౌలింగ్ తో అనేక సంచలనాలు సృష్టించాడు.అయితే రిటైర్మెంట్ తర్వాత కూడా తన సంచనాలను కొనసాగించాలని కంకణం కట్టుకున్నట్లు అర్థం అవుతోంది.
ఎలాగు రిటైర్మెంట్ తర్వాత క్రికెట్ జట్టుకు ఆడటం లేదు కాబట్టి, తన మాటలతో వివాదాలను సృష్టిస్తూ ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ గా కొనసాగుతున్నాడు.ఇక తాజాగా సోషల్ మీడియాలో షోయబ్ అక్తర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
తాను గడ్డి తినడానికి కూడా రెడీగా ఉన్నట్లు తెలియజేశాడు.దీనికి గల కారణం చూస్తే… తమ దేశ ఆర్మీ బడ్జెట్ ను పెంచుకోవడం కోసం తాను ఇలా చేయడానికి కూడా సిద్ధమేనని తెలియజేస్తున్నారు.” అల్లాహ్ దేవుడు నాకు అధికారం ఇస్తే గడ్డి తిని అయినా సరే, ఆర్మీ బడ్జెట్ పెంచుతాను” అని చెప్పుకొచ్చాడు.
అంతే కాకుండా ఒకవేళ మా దేశంలో ఆర్మీ బడ్జెట్ 20 శాతం ఉంటే దాన్ని నేను ఎలాగైనా ప్రయత్నించి 60 శాతం వరకు చేస్తానని స్పష్టం చేశాడు.
ఈ విషయంపై తాను ఆర్మీ చీఫ్ తో కూర్చొని మాట్లాడతాను అని వివరించాడు.అంతేకాకుండా పాకిస్తాన్ సివిల్ సెక్టార్, పాకిస్తాన్ ఆర్మీ తో ఎందుకు కలిసి పని చేయదో తనకు అర్థం కావడం లేదని చెప్పుకొచ్చాడు.
అంతేకాకుండా తన దేశ ఆర్మీ ని ప్రస్తావిస్తూ ఒకరికి ఒకరం విమర్శించుకుంటూ వెళితే చివరికి నష్టపోయేది మనమే అని తెలియజేశాడు.అయితే ఈ వ్యాఖ్యలపై పాక్ ఆర్మీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి మరి.