టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద సూపర్ హట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.
ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో తన నెక్ట్స్ మూవీని గీతాగోవిందం డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.
ఇటీవల ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.
ఈ సినిమాకు ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేశారు.కాగా ఈ సినిమాను ఆర్థిక నేరాల బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కించేందుకు పరశురామ్ రెడీ అవుతున్నాడు.
ఇక ఈ సినిమాలో మహేష్‌ను అదిరిపోయే అల్ట్రా మోడ్రన్ లుక్‌లో మనకు చూపించేందుకు రెడీ అవుతున్నాడు పరశురామ్.అయితే ఈ సినిమాను తెరకెక్కిస్తున్న పరశురామ్‌కు ఈ చిత్ర మేకర్స్ బంపరాఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కోసం పరశురామ్‌కు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ ఇస్తారని అందరూ అనుకున్నారు.కానీ ఈ సినిమాను తెరకెక్కించినందుకు ఆయనకు ఈ సినిమా లాభాల్లో వాటా ఇచ్చేందుకు చిత్ర నిర్మాతలు అంగీకరించారట.
దీంతో ఈ సినిమాతో పరశురామ్ పేరుతో పాటు సంపాదన కూడా దండిగానే తీసుకోనున్నాడని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఏదేమైనా ఈ సినిమాతో పరశురామ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.