పెరుగుతున్న జనాబా మరియు ఇతరత్ర కారణాల వల్ల ప్రతి వస్తువు కూడా కల్తీ అవుతోంది.ఎక్కువ రేటు పెట్టినా కూడా మంచి వస్తువులు దొరుకుతున్నాయా అనే నమ్మకం లేదు.
ప్రతి దానికి కూడా కల్తీ రంగు పులుముతున్నారు.అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకన్న నేపథ్యంలో కళ్లు మూసుకుని తినాల్సిందే అంటూ అంతా ఒక నిర్ణయానికి వచ్చారు.
కల్తీ అని చూస్తూ కూర్చుంటే కడుపు ఎండే పరిస్థితి వస్తుంది.అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో తినేద్దాం అని అంతా అనుకుంటున్నారు.
అయితే పిల్లల పాలు కూడా కల్తీ అవుతున్నన నేపథ్యంలో వారికి చూస్తూ చూస్తూ ఎలా విషపు పాలు ఇస్తామని తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అలాంటి వారి ఆవేదనకు చెలించిన దివ్యారెడ్డి డైరీ ఫామ్‌ను ఏర్పాటు చేసింది.
హైదరాబాద్‌లో సంపన్నులు ఎక్కువ శాతం ప్రస్తుతం దివ్యారెడ్డి డైరీ పాలను కొనుగోలు చేస్తున్నారు.ఆన్లైన్లో హైదరాబాద్‌లో ఏ ప్రాంతం నుండి అయినా ఆర్డర్ ఇవ్వవచ్చు.ఆర్డర్ ఇచ్చిన పావు గంట నుండి గంటలోపు పాలు సరఫరా చేస్తారు.పాలు పిండి వాటిని ఒక స్టీల్ పాత్రలో తీసుకుని వినియోగదారుల వద్దకు తీసుకు వెళ్తారు.
ప్లాస్టిక్ ఇంకా చెత్త చెదారం పాత్రల్లో పాలను సరఫరా చేయకుండా అత్యంత నాణ్యత, స్వచ్చతను పాటిస్తూ పాలను సరఫరా చేస్తున్నారు.
గచ్చిబౌలిలోని ఒక విల్లాలో దివ్యారెడ్డి ఈ డైరీ ఫామ్ నడుపుతున్నారు.మేలు జాతి ఆవులను ఆమె పెంచుతూ పాల ఉత్పత్తి చేస్తున్నారు.ఆమె పాల ఉత్పతికి సంబంధించిన ప్రతి విషయంలో కూడా శాస్త్రీయంగా పద్దతి పాటిస్తున్నారు.
ఎలాంటి కెమికల్స్ లేవు, ఎలాంటి ప్రమాదకర పాత్రలను వాడటం లేదు.పిండిన వెంటనే పాలను వినియోగదారులకు పంపించడం జరుగుతుంది.
మామూలుగా అయితే నేటి పాలు వినియోగదారుల వద్దకు రేపటికి కాని చేరవు.కాని దివ్యారెడ్డి డైరీకి ఆన్లైన్ ద్వారా ఆర్డర్ ఇస్తే నేడు పిండిన పాలు నేడే అది కూడా రెండు మూడు గంటల లోపే పాలు చేరిపోతాయి.
అందుకే దివ్యారెడ్డి డైరీ ఫామ్ పాలకు హైదరాబాద్‌లో చాలా డిమాండ్ ఉంది.
లీటరు 150 రూపాయలు అన్నా కూడా కొందరు ఆ పాలను ఎక్కువగా తీసుకుంటున్నారు.దివ్యారెడ్డి ఫామ్‌లో పాలు మాత్రమే కాకుండా పాల సంబంధించి పలు ప్రొడెక్ట్ కూడా అందుబాటులో ఉన్నాయి.వ్యాపారంలో ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా దివ్యారెడ్డి మాత్రం నలుగురికి స్వచ్చమైన పాలు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ బిజినెస్‌ను ప్రారంభించినట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.