కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో జరగనున్న ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదల చేసింది.తొలి విడతలో భాగంగా ఏప్రిల్ 11న ఏపీలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రకటించింది.
దాంతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి.కేవలం నెల రోజుల సమయం లో అభ్యర్థులు ప్రకటించాలి, వారితో నామినేషన్లు వేయించాలి ,వేసిన నామినేషన్ ఉపసంహరించుకోవడం, మధ్యలో అసంతృప్తులను బుజ్జగించడం, ఇలా ఈ ప్రక్రియకు ఉన్నది కేవలం 30 రోజులు మాత్రమే.
ఈ 30 రోజుల్లోనే నేతల తలరాతలు మారనున్నాయి, పార్టీల భవిష్యత్తు తేలిపోనుంది.అయితే తరుముకొస్తున్న ఎన్నికల కోసం ఏపీలో ప్రధాన పార్టీలు అన్నీ సిద్దంగా ఉన్నాయా.?? పార్టీ ఎంత సన్నద్ధంగా ఉంది.?? ఈసీ నిర్ణయంతో ఎవరికి లాభం.?? ఎవరికి నష్టం.?? అనే వివరాల్లోకి వెళితే.
ఏపీ అధికార పార్టీ టిడిపి విషయానికి వస్తే ఏ క్షణాన్నైనా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనే విషయాన్ని చంద్రబాబు ముందుగానే ఊహించారు, కాబట్టి జిల్లాల వారీగా నేతలతో భేటీలు వేస్తూ అభ్యర్థుల ఎంపికను చకచక పూర్తి చేసేశారు.దాదాపు 115 స్థానాల్లో లో అభ్యర్థులను ఖరారు చేసిన బాబు ఇంకా 60 స్థానాలలో అభ్యర్థులను డిసైడ్ చేయాల్సి ఉంది అయితే.
తాజాగా ఈసీ తీసుకున్న నిర్ణయంతో ఒకటి రెండు రోజుల్లోనే చంద్రబాబు మిగిలిన స్థానాల్లో లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారట.

ఇక వైసీపీ విషయానికి వస్తే టీడీపీకి పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది కొన్ని స్థానాలలో లో టీడీపీకి అభ్యర్థులు దొరకడమే కష్టంగా ఉంటే వైసిపికి మాత్రం అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.వారందరి నుంచీ అభ్యర్థిని ఎంపిక చేయడం జగన్ కు కష్టతరమైన పని అంటున్నారు పరిశీలకులు.అయినప్పటికీ జగన్ కూడా అ చాలాచోట్ల అభ్యర్థులను ప్రకటించారు, చంద్రబాబు కంటే ముందే ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా అభ్యర్థిని ప్రకటించి జగన్ లోక్సభ అభ్యర్థుల విషయంలో వెనుకపడ్డారని చెప్పవచ్చు.

ఇక టిడిపి, వైసిపి తో పోలిస్తే జనసేన పరిస్థితి అత్యంత దారుణ అతి దారుణంగా ఉందని తొలిసారి ఎన్నికలను ఎదుర్కొంటున్న జనసేనకి ఈసీ తీసుకున్న నిర్ణయం కోలుకోలేని దెబ్బ అంటున్నారు పరిశీలకులు.తమకు అభ్యర్థుల కొరత లేదని పవన్ పై పైకి చెప్తున్నా , చాలా నియోజకవర్గాల నుంచి స్క్రీనింగ్ కమిటీకి దరఖాస్తులు రాకపోవడం జనసేన లో గుబులు రేపుతోంది.అసలు పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఇప్పటికీ తేల్చుకోలేని పరిస్థితి జనసేన లో ఉంది
జనసేన లో లో ద్వితీయ శ్రేణి నాయకత్వం వన్ లేకపోవడం ఆ పార్టీ కి కోలుకోలేని దెబ్బ అంటున్నారు పరిశీలకులు.ప్రధాన పార్టీలలో లో ఉన్న అసంతృప్తులు తన పార్టీలోకి వస్తారేమోనని ఆశతో ఎదురుచూస్తున్న పవన్ కి ఇప్పుడు తాజా పరిణామాలు షాక్ ఇవ్వడంతో పవన్ కూడా అభ్యర్థుల వేటలో బిజీ బిజీగా ఉన్నట్లు గా తెలుస్తోంది.
మొత్తం మీద ఈ 30 రోజుల్లో ప్రధాన పార్టీలైన వైసిపి టిడిపి లు తనకున్న అనుభవంతో నిలదొక్కుకుంటారు , కానీ తీవ్ర స్థాయిలో నష్టపోయేది మాత్రం జనసేన అంటున్నారు విశ్లేషకులు
.