విధి నిర్వహణలో ఎవరు ఎలా ఉన్నా ఆర్మీ మరియు పోలీసు వారు కాస్త ఏమరపాటుతో ఉన్నా కూడా చాలా పెద్ద నష్టం జరుగుతుంది.అందుకే డ్యూటీలో ఉన్న సమయంలో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
విధినిర్వహణలో చిన్న తప్పిదం చేసినా కూడా వారికి కఠిన శిక్షను ఉనత్నాధికారులు విధిస్తూ ఉంటారు.తాజాగా తమిళనాడుకు చెందిన ఇద్దరు ఎస్‌ఐలు ఈ విధంగానే వ్యవహరించడంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వారి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
వారు చేసిన పనికి జాబ్ నుండి తొలగించాలని చాలా మంది కోరుతున్నారు.కొందరు మాత్రం మొదటి తప్పుగా వదిలేయాలని అంటున్నారు.
ఆ ఇద్దరు ఎస్‌ఐలు చేసిన ఆ తప్పేంటో తెలిస్తే మీరు అవాక్కవుతారు, అదేంటి అంటే ఇద్దరు కలిసి టిక్ టాక్‌లో వీడియో చేయడం.ఆ ఇద్దరు ఎస్‌ఐలలో ఒక మహిళ ఎస్‌ఐ కూడా ఉండటం మరింతగా ఈ విషయాన్ని సీరియస్ చేసింది.
వివరాల్లోకి వెళ్తే.తమిళనాడు మధురై పరిధిలో ఎస్‌ఐలుగా పని చేస్తున్న వీరు తాజాగా ఒక డ్యూటీ నేపథ్యంలో కలిశారు.
ఇద్దరికి పరిచయం ఉంది.ఇద్దరు మంచి స్నేహంగా మెలిగేవారు.
అందుకే వారిద్దరు ఈమద్య కాలంలో తెగ ట్రెండ్ అవుతున్న టిక్‌టాక్‌లో ఒక వీడియో చేయాలనుకున్నారు.తమిళపాట కాదల్ మగరాణి పాటకు వారిద్దరు డాన్స్ చేశారు.
యూనిఫాంలో ఉండి, అది కూడా డ్యూటీలో ఉండి ఇలాంటి పాటలు చేయడం ఏంటీ అంటూ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆ ఇద్దరు ఎస్‌ఐలు చేసిన వీడియో ఇండియాలోనే టాప్‌లో ట్రెండ్ అయ్యింది.దాంతో ఆ వీడియోపై తీవ్ర స్థాయిలో రాజకీయ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికే తమిళనాడులో టిక్‌టాక్ బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో పని మానేసి ఇద్దరు ఎస్‌ఐలు ఇలా చేయడంతో ఆ డిమాండ్ మరింతగా పెరిగింది.తమిళనాడు ప్రభుత్వం ఇటీవలే అసెంబ్లీలో టిక్‌టాక్ బ్యాన్ చేయాలని నిర్ణయించి, కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెల్సిందే.
కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు ప్రభుత్వం ఒకవైపు ఒత్తిడి చేస్తుంటే మరో వైపు ఇలా ఎస్‌ఐలు టిక్‌టాక్‌లు చేస్తుంటే మండదా మరి.ఇద్దరిని తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది.ఉన్నతాధికారులు వారిని ప్రశ్నిస్తున్నారు.ఆ ఇద్దరి ఎస్‌ఐల ఉద్యోగాల పరిస్థితి ఏంటీ అనేది వారం రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.