ప్రస్తుతం సినీ ఇండస్ట్రీని కాస్టింగ్ కౌచ్ ఒక ఊపు ఊపేస్తోంది.తెలుగులోనే కాదు అన్ని భాషల సినీ పరిశ్రమల్లో అదే పరిస్థితి.
నటి స్వర భాస్కర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు సంఘటన గురించి గుర్తు చేసుకున్నారు.ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది చాలా కాలంగా ఉందని, తాను కూడా వీటిని ఫేస్ చేశానని తెలిపారు.
‘షూటింగ్‌కి వెళ్లినప్పుడు ఒక వ్యక్తి నాతో దురుసుగా ప్రవర్తించాడు.అతను నా చెవులను ముద్దాడే ప్రయత్నం చేస్తూ ‘ఐ లవ్ యూ బేబీ ’ అంటూ విచిత్రమైన చూపులతో సంజ్ఞ చేశాడు.దగ్గరకు వచ్చి తలపై చేయి వేసి దురుసుగా ప్రవర్తించాడు.ఆ సమయంలో నాకు షూటింగ్ మానేసి ఇంటికి వెళ్లిపోవాలనిపించింది.తర్వాత నేను అతన్ని పట్టించుకోలేదు’ అని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఫెమినిజం గురించి మాట్లాడుతూ… సినిమా రంగంతో పాటు చాలా రంగాల్లో లింగ సమానత్వం లేదని, మహిళలకు పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించడం లేదని అన్నారు.
ఇందులో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు.